Homeటాప్ స్టోరీస్'మా' ఎలక్షన్స్ : ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు.. గెలుపెవరిది..?

‘మా’ ఎలక్షన్స్ : ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు.. గెలుపెవరిది..?

MAA Elections Prakash Raj vs Manchu Vishnu Who will Win
 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ జెనరల్ ఎలక్షన్స్ రేంజ్ లో ఎత్తులు.. పైఎత్తులు.. గొడవలు.. వివాదాలతో జరుగనున్నాయి. అక్టోబర్ 10న జరుగనున్న మా ఎలక్షన్స్ లో ప్రస్తుతం ఇద్దరు ప్రధాన పోటీ దారుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందన్న మాట వాస్తవం.

ముందు బరిలో ఐదుగురు :

- Advertisement -

మా ఎలక్షన్స్ అనగానే తాము పోటీ చేస్తామంటూ ఈసారి ఐదుగురు తమ పోటీని ప్రకటించారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ, సి.వి.ఎల్ నరసిం హా రావు. ఇలా అందరు మా ప్రెసిడెంట్ పదవికి పోటీకి దిగాలని అనుకున్నారు.

వెనక్కి తగ్గిన ముగ్గురు :

ప్రకాష్ రాజ్ మెనిఫెస్టో నచ్చో.. ఆయన ఖచ్చితంగా మాకి మంచి చేస్తాడని అనిపించో.. హేమ, జీవిత రాజశేఖర్ లు ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సపోర్ట్ గా నిలిచారు. వారిలో ఒకరికి జెనరల్ సెక్రటరీ.. మరొకరికి వైస్ ప్రెసిడెంట్ కేడర్ ఇచ్చాడు ప్రకాష్ రాజ్. ఇక చివరిలో తెలంగాణా వాదంతో వచ్చిన సి.వి.ఎల్ నరసిం హా రావు కూడా తన మేనిఫెస్టో రిలీజ్ చేశాక.. తన నామినేషన్ రద్దు చేసుకుని ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఐదుగురు బరిలో దిగితే ముగ్గురు వెనక్కి తగ్గి.. ఇద్దరి మధ్య పోటీ ఏర్పడేలా చేశారు.

ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు మాటల యుద్ధం :

ఇక ప్రధాన పోటీ దారులు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఆయన ప్రెస్ మీట్ తర్వాత ఈయన.. ఈయన మాట్లాడిన తర్వాత ఆయన ఒకరి మీద ఒకరు పంచులేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. అయితే ముందు గారు గారు అనుకుంటూ ప్రత్యర్ధుల మీద మాటలను జారుగుతున్నారు.

పోస్టర్ బ్యాలెట్ విధానాన్ని తప్పుపడుతూ ప్రకాష్ రాజ్.. 60 ఏళ్లు పై బడినా వారి ఫీజుని మంచు విష్ణు ఎలా చెల్లిస్తాడని కొత్త వాదన తెరలేపారు. అయితే ఆ తర్వాత మంచు విష్ణు దానికి వివరణ ఇచ్చుకున్నారు. మొత్తానికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ల మా ఫైట్ తారాస్థాయికి చేరిందని చెప్పాలి.

గెలుపెవరిది :

ముందు మెగా కాంపౌండ్ ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ గా నిలిచింది. నాగ బాబు మొదట్లో ప్రకాష్ రాజ్ తరపున మాట్లాడాడు. అయితే గత వారం రోజులుగా ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ ల గురించి.. మా ఫైట్ గురించి మెగా కాంపౌండ్ సైలెంట్ గా ఉంటూ వస్తుంది. నాగ బాబు కూడా ఈ ప్రస్థావన తీసుకురావట్లేదు.

ప్రస్తుతానికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు రెండు ప్యానళ్లు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాయి. అయితే తెలుగు వాదం బలంగా వినిపిస్తున్న తరుణంలో మంచు విష్ణుకి అదొక్కటి ప్లస్ గా మారే అవకాశం ఉంది.

అక్టోబర్ 10న గెలిచేది ఎవరన్నది తెలుస్తుంది. అయితే గెలిచేందుకు అది చేస్తాం. ఇది చేస్తామన్న వీరు.. గెలిచాక ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మా బిల్డింగ్ తో పాటుగా అర్హులకు సొంత ఇల్లు.. ఇంకా పెన్షన్.. ఇన్సూరన్స్ ఇలా వారి మేనిఫెస్టోలో చాలా వరకు చేర్చిన అభ్యర్ధులు గెలిచిన తర్వాత ఎంతవరకు వాటిని చేస్తారన్నది చూడాలి.

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All