Homeటాప్ స్టోరీస్చైతూ, పల్లవి మ్యాజిక్ – “ఏయ్...పిల్లా..!” సాంగ్

చైతూ, పల్లవి మ్యాజిక్ – “ఏయ్…పిల్లా..!” సాంగ్

చైతూ, పల్లవి మ్యాజిక్ – “ఏయ్...పిల్లా..!” సాంగ్
చైతూ, పల్లవి మ్యాజిక్ – “ఏయ్…పిల్లా..!” సాంగ్

సాఫ్ట్ లవ్ స్టోరీస్ ని ఎంతో హార్ట్ టచింగ్ గా చెప్పే డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు మళ్ళీ ఒక మంచి ప్రేమకథతో మన ముందుకు వచ్చేశారు. ప్రేమకథలకు పెట్టింది పేరైన అక్కినేని ఫ్యామిలీ పెద్దబ్బాయి “నాగ చైతన్య” మరియు “టాలీవుడ్ మలర్” సాయి పల్లవి కాంబినేషన్ లో ఏషియన్ గ్రూప్ అధినేత సునీల్ నారంగ్ సర్ నిర్మాతగా “లవ్ స్టోరీ” సినిమాను మనకు అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తాజాగా వచ్చిన “ఏయ్..పిల్లా..!” అనే పాట మొదట నెమ్మదిగా మొదలై.. ఆ తర్వాత ఎంతో గ్రాండ్ నేరేషన్ వైపుగా కంపోజ్ చేసారు మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సి.హెచ్. ఇక ఈ పాటకు “చైతన్య పింగళి” రాసిన లిరిక్స్ సులభంగా అర్ధమవుతూ, ఎంతో గొప్ప, గంభీరమైన, లోతైన ఆలోచనలను.. పోలికలను మనకు చెప్తున్నాయి. ఉదాహరణకు గమనిస్తే

“వచ్చే మలుపులు…. రాస్తా వెలుగులు… జారే చినుకు జల్లే…;

- Advertisement -

పడుగు పేకల మల్లే…. నిన్నూ… నన్నూ అల్లే…

నింగిన మబ్బులు ఇచ్చిన బహుమతి నేలన కనిపిస్తుందే…

మారే బొమ్మలు గీసే…. తేలే బొమ్మలు చూడే….”

ఇలా అటు స్థానిక తెలంగాణకు సంబంధించిన పదాలు వాడుతూనే, ప్రేమకు సంబంధించి బలమైన, లోతైన భావాలు మనకు తెలియచేసారు. ఇక ఈ పాటను హరిచరణ్ గానం చేసారు. ఇక పాట బ్యాక్ డ్రాప్ మొత్తం హీరో, హీరోయిన్స్ పంట పొలాలు, మెట్రో స్టేషన్ లోకేషన్స్ చూపించారు. అసలు ఈపాటకు సంబంధించి రిలీజ్ చేసిన షాట్స్ లో నాగ చైతన్య మరియు సాయి పల్లవి అతి తక్కువ మేకప్ తో, న్యాచురల్ లుక్ తో చూపించిన ఆలోచనకు హ్యాట్సాఫ్. వాళ్ళిద్దరి ఎక్స్ ప్రేషన్స్  ఈ పాటకు మరొక హైలెట్. మొత్తానికి ప్రేమలో మునిగితేలే లవర్స్ కి డైరెక్టర్ శేఖర్ కమ్ముల మంచి గిఫ్ట్ ఇచ్చేసారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All