
లంచగొండి వ్యవస్థపై శంకర్ సంధించిన బ్రహ్మాస్త్రం `ఇండియన్`. కమల్‌హాసన్ హీరోగా నటించిన ఇదే చిత్రాన్ని తెలుగులో `భారతీయుడు` పేరుతో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 1996లో విడుదలై సంచలన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సంచలన విజయాన్ని సాధించిన ఈ చిత్రానికి సీక్వెల్‌గా శంకర్ `ఇండియన్ 2`ని గత ఏడాది మొదలుపెట్టారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొన్ని నెలల తర్జనభర్జనల తరువాత ఎట్టకేలకు ఈ చిత్ర షూటింగ్ మొదలైంది.
చెన్నైలోని ఓ స్టూడియోలో కీలక ఘట్టాలు చిత్రీకరిస్తుండట క్రేన్ కూలి యూనిట్ సభ్యులు మృతి చెందడం కలకలం రేపింది. భద్రతా కారణాలని చూపిస్తూ లైకాకు, కమల్‌హాసన్‌కు శంకర్‌కు మధ్య పెద్ద దుమారమే రేగింది. సినిమా ఆగిపోతుందా అనేస్థాయికి వీరి గొడవలు చేరుకున్నాయి. కమల్ చొరవ తీసుకోవడంతో వివాదం సద్దుమనిగింది. ఇక షూట్ స్టార్ట్ అనుకునే లోపే కరోనా వైరస్ స్వైరవిహారం చేయడం మొదలుపెట్టింది. దీంతో ఈ మూవీ షూటింగ్ గత ఏడు నెలలుగా ఆగిపోయింది.
తాజాగా బిగ్ మూవీస్ అన్నీ మళ్లీ షూట్ మొదలుపెట్టాయి. కానీ `ఇండియన్ 2` గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. ఎప్పుడు మొదలుపెడతారన్న వార్తే లేదు. దీంతో శంకర్ అసహనానికి గురవుతున్నారట. లైకా నుంచి ఈ ప్రాజెక్ట్ రీ స్టార్ట్ గురించిన ప్రకటన కానీ పిలుపు కానీ లేదని, ఏదో ఒకటి క్లారిటీ ఇస్తే తను మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తుకుంటానని శంకర్ ఆలోచనలో వున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి లైకా వర్గాలు ఏమంటాయో చూడాలి.