Homeటాప్ స్టోరీస్మరో కొత్త రిలీజ్ డేట్ ను లాక్ చేసిన లవ్ స్టోరీ

మరో కొత్త రిలీజ్ డేట్ ను లాక్ చేసిన లవ్ స్టోరీ

love story to release on september 24
love story to release on september 24

గత సమ్మర్ లో విడుదల కావాల్సిన లవ్ స్టోరీ, కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ కు వాయిదా పడింది. అప్పుడు కరోనా సెకండ్ వేవ్ రావడంతో మరోసారి వాయిదా పడి సెప్టెంబర్ 10కి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. అయితే నిన్న వినాయక చవితి వీకెండ్ అయినా కూడా లవ్ స్టోరీ విడుదల కాలేదు. మరోసారి వాయిదా పడింది.

లవ్ స్టోరీ విడుదల తేదీపై మరోసారి అధికారిక ప్రకటన వచ్చింది. సెప్టెంబర్ 24న ఈ చిత్రం విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. మరి ఈ డేట్ కైనా లవ్ స్టోరీ విడుదలవుతుందో లేదో చూడాలి. ఇక నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్.

- Advertisement -

వీళ్ళద్దరి కాంబినేషన్ బాగుందని ప్రోమోస్ చూస్తే అర్ధమవుతోంది. మరోవైపు లవ్ స్టోరీ సాంగ్స్ కూడా ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా సారంగ దరియా, ఏ పిల్లా వంటి సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మొత్తంగా లవ్ స్టోరీపై మంచి అంచనాలే ఉన్నాయి. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ఏషియన్ సినిమాస్ నిర్మించింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All