Homeటాప్ స్టోరీస్లవ్ స్టోరీ: ఆశలు చిగురింపజేస్తోన్న సెకండ్ వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్

లవ్ స్టోరీ: ఆశలు చిగురింపజేస్తోన్న సెకండ్ వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్

 

love story second weekend advances are promising
love story second weekend advances are promising

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల రూపొందించిన లవ్ స్టోరీ చిత్రానికి అంతటా పాజిటివ్ టాక్ వచ్చింది. ఫస్ట్ వీకెండ్ దాకా కలెక్షన్స్ కూడా మార్మోగిపోయాయి. ఫస్ట్ వీకెండ్ కే ఈ చిత్రం 21 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే వీక్ డేస్ లో లవ్ స్టోరీ మరీ నెమ్మదించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో పడుతోన్న వర్షాలు కూడా దీనికి ప్రధాన కారణం.

- Advertisement -

ఇంత మంచి టాక్ తెచ్చుకున్న చిత్రం ప్లాప్ బాటలో వెళ్లడం అందరినీ కలవరపెట్టింది. అయితే ఇప్పుడు సెకండ్ వీకెండ్ కు అడ్వాన్స్ బుకింగ్స్ సంఖ్య పెరుగుతుండడం కొంత సానుకూలాంశం. సెకండ్ వీకెండ్ తో లవ్ స్టోరీ కలెక్షన్స్ మళ్ళీ పెరుగుతాయని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో ఈ చిత్రం హిట్ అనిపించుకోవడానికి ఎంతో దూరం లేదు. అయితే ఏపీలో టికెట్ ధరలు తక్కువ ఉండడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సేవ్ అవ్వాలంటే లవ్ స్టోరీ మరింతగా పెర్ఫర్మ్ చేయాల్సి ఉంది.

సెలబ్రిటీల నుండి కూడా లవ్ స్టోరీకు మంచి సపోర్ట్ లభించింది. పవన్ సిహెచ్ లవ్ స్టోరీకి అందించిన సంగీతం చాలా పెద్ద ప్లస్ గా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All