Homeటాప్ స్టోరీస్భారీగా డ్రాప్ అయిన రిపబ్లిక్, లవ్ స్టోరీ కలెక్షన్స్

భారీగా డ్రాప్ అయిన రిపబ్లిక్, లవ్ స్టోరీ కలెక్షన్స్

భారీగా డ్రాప్ అయిన రిపబ్లిక్, లవ్ స్టోరీ కలెక్షన్స్
భారీగా డ్రాప్ అయిన రిపబ్లిక్, లవ్ స్టోరీ కలెక్షన్స్

లవ్ స్టోరీ చిత్రం టాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురింపజేసింది. తొలి వీకెండ్ లో ఈ చిత్రం భారీగా వసూళ్లు సాధించింది. అయితే తొలి వీకెండ్ ముగిసాక కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. మళ్ళీ సెకండ్ వీకెండ్ కు పికప్ అయిన ఈ చిత్రం అది ముగిసాక సోమవారం నుండి కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. మంగళ, బుధవారాల్లో కలెక్షన్స్ లో డ్రాప్ మరింత కనిపించింది.

సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన రిపబ్లిక్ చిత్రం కూడా ఇదే కోవలో ప్రయాణం చేస్తోంది. తొలి వీకెండ్ కలెక్షన్స్ ఆశాజనకంగా ఉండగా వీక్ డే నుండి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. మళ్ళీ సెకండ్ వీకెండ్ నాటికి పికప్ అవుతాయేమో చూడాలి. సెకండ్ వేవ్ తర్వాత తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ట్రెండ్ కనిపిస్తోంది. సాధారణంగా వీక్ డేస్ లో డ్రాప్స్ ఉండటం సహజమే కానీ సెకండ్ వేవ్ తర్వాత భారీ రేంజ్ లో కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి.

- Advertisement -

ఇక ఈ వారాంతం కొండ పొలం, ఆరడుగుల బుల్లెట్ వంటి చిత్రాలు విడుదలవుతున్నాయి. దసరాకు మహా సముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రాలు పోటీ పడుతుండడంతో అప్పటికి కలెక్షన్స్ ఫుల్ ఫ్లో లో ఉంటాయని నిర్మాతలు ఆశిస్తున్నారు. దసరా పండక్కి చిత్రాలు చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతుంటారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All