
విభు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షన్ దర్శకత్వంలో విభు ప్రొడక్షన్స్ వారు నిర్మించిన చిత్రం “Lolipop”. “Never Tasted Before Very Hot and Spicy” ట్యాగ్ లైన్, A True Story With Fictional Emotions అనే మెయిన్ కాప్షన్ తో ట్రైలర్ రిలీజ్ అయి యూట్యూబ్ లో రచ్చ రచ్చ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఇందులో నటి నటులు, హర్ష నల్లబెల్లి, మమత సాంబ, మధు తెలప్రోలు, తరుణ్,లోకేష్ ఆచారి ఉత్తరాది,లక్కీ నటించారు. తెలుగులో మొదటిసారి గా చాలా డిఫరెంట్ కథ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంటూ చాలా పెద్ద ఎత్తున OTT లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. ఈ చిత్రం ట్రైలర్ చాలా వైరల్ అవుతుంది. కథ ఎలా ఉంటుందో చూడాలి ఈ చిత్రానికి కథ లైన్ సాయి రామ్ దాసరి ఇవ్వడం విశేషం.
డైరెక్టర్ హర్షన్ మాట్లాడుతూ.. చాలా మంది ట్రైలర్ బోల్డ్ గా వుంది అంటున్నారు. ఈ కథ కూడా బయట కొంతమంది అమ్మాయిలకి కి జరుగుతున్న దారుణలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రం చేయడం జరిగింది. ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో జరిగే కథ, పోస్టర్, ట్రైలర్ బోల్డ్ గా వున్నా కథ లో మంచి మెసేజ్ వుంది. నన్ను మా కథని నమ్మి కొత్తవాల్లమైనా వెనకాడకుండా విభు ప్రొడక్షన్ వాళ్ళు ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా చాలా బాగా వస్తుంది . మా చిత్ర నటి నటులు, మా టీమ్ అందరూ ఎంతో కష్టపడి వర్క్ చేశారు. వారందరికీ నా థాంక్స్ ప్రేక్షకులు మా చిన్న సినిమాని ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు.
నటి నటులు, హర్ష నల్లబెల్లి, మమత సాంబ, మధు తెలప్రోలు, తరుణ్,లోకేష్ ఆచారి ఉత్తరాది,లక్కీ నటించారు.
సాయి రామ్ దాసరి లైన్ ఇవ్వగా, విభు ప్రొడక్షన్ వారు నిర్మించిన ఈ చిత్రానికి,
రచన-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం
హర్షన్ చేశారు.
