Homeటాప్ స్టోరీస్మే 26th న లాలీపాప్ ట్రైలర్ విడుదల

మే 26th న లాలీపాప్ ట్రైలర్ విడుదల

మే 26th న లాలీపాప్ ట్రైలర్ విడుదల
మే 26th న లాలీపాప్ ట్రైలర్ విడుదల

విభు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షన్ దర్శకత్వంలో విభు ప్రొడక్షన్స్ వారు నిర్మించిన చిత్రం “Lolipop”. “Never Tasted Before Very Hot and Spicy” ట్యాగ్ లైన్, A True Story With Fictional Emotions అనే మెయిన్ కాప్షన్ తో మన ముందుకు వస్తుంది. ఇందులో నటి నటులు, హర్ష నల్లబెల్లి, మమత సాంబ, మధు తెలప్రోలు, తరుణ్,లోకేష్ ఆచారి ఉత్తరాది,లక్కీ నటించారు. తెలుగులో మొదటిసారి గా చాలా డిఫరెంట్ కథ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంటూ చాలా పెద్ద ఎత్తున OTT లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది..పోస్టర్ ని చూస్తుంటే చాలా బోల్డ్ గా వుంది. ఈ చిత్రం ట్రైలర్ మే 26th న విడుదల చేస్తున్నారు. కథ ఎలా ఉంటుందో చూడాలి ఈ చిత్రానికి కథ లైన్ సాయి రామ్ దాసరి ఇవ్వడం విశేషం. ఈ కథ గత సాయి రామ్ దాసరి సినిమాలు ఉన్నట్టు కాంట్రవర్సీ గా వుంటుందా అనేది మనం చూస్తే గాని చెప్పలేం..

డైరెక్టర్ హర్షన్ మాట్లాడుతూ.. నాకు ఈ చిత్రం నేను డైరెక్షన్ చేయగలనా లేదా అని మాత్రమే చేసాను. నేను ఎప్పటికి కూడా బోల్డ్ సినిమాలు చేయడం జరగదు. ఈ కథ కూడా బయట కొంతమంది అమ్మాయిలకి కి జరుగుతున్న దారుణలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రం చేయడం జరిగింది. సాయి రామ్ దాసరి గారితో కలిసి నేను 7 మూవీస్ వర్క్ చేశాను. నా మీద నమ్మకం తో ఈ లైన్ ఇచ్చారు .ఈ లైన్ సాయి రామ్ దాసరి గారు చెప్పినప్పుడు నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు ఇప్పటిదాకా రకరకాల సినిమాలు చూసుంటారు. ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో జరిగే కథ, పోస్టర్, ట్రైలర్ బోల్డ్ గా వున్నా కథ లో మంచి మెసేజ్ వుంది. నన్ను మా కథని నమ్మి కొత్తవాల్లమైనా వెనకాడకుండా విభు ప్రొడక్షన్ వాళ్ళు ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా చాలా బాగా వస్తుంది . మా చిత్ర నటి నటులు, మా టీమ్ అందరూ ఎంతో కష్టపడి వర్క్ చేశారు. వారందరికీ నా థాంక్స్. మే 26th ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తాం. ప్రేక్షకులు మా చిన్న సినిమాని ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.. అని అన్నారు.

- Advertisement -

సాయి రామ్ దాసరి మాట్లాడుతూ.. అరేయ్ హర్ష అని పీలిచే నేను డైరెక్టర్ హర్షన్ అని పిలిచే లా చేసాడు. ఈ కథ సరదాగా చెప్తే సీరియస్ గా తీసుకున్నాడు. ఏ సపోర్ట్ లేకున్నా సినిమా చేయగలిగే దమ్ము ఉన్నోడు వీడు. ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు హర్ష ఖర్చు కూడా ఎక్కువ పెట్టనివ్వట్లేదు అని, నేను హర్ష తో ఒక్కసారి అన్నాను. చిన్న ప్రొడ్యూసర్ ని మనం కాపాడుకోవాలి అని నేను చెప్పిన మాట మైండ్ లో పెట్టుకుని చేయడం నాకు చాలా సంతోషంగా వుంది. ఈ సినిమా లైన్ ఇచ్చి మర్చిపోయా దాన్ని ఇప్పుడు సినిమా చేసి గుర్తు చేసాడు. ఈ చిత్ర ట్రైలర్ ను మే 26th న చూడాలి ఏం చేశాడో అని, ఈ చిత్రం తరువాత మళ్ళీ మేం బోల్డ్ చిత్రం తీయబోయేది లేదు. ఈ చిత్రం తరువాత హర్షన్ రాసుకున్న కథ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మంచి కథ తో మీ ముందుకు వస్తాడు. చిన్న ప్రొడ్యూసర్ ని మనం కాపాడుకోవాలి అని అందరికి చెప్పారు. ఇప్పటి నుంచి చాలా మంచి కాన్సెప్ట్ మాత్రమే తీస్తాం. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి All the best అని చెప్పారు.

నటి నటులు, హర్ష నల్లబెల్లి, మమత సాంబ, మధు తెలప్రోలు, తరుణ్,లోకేష్ ఆచారి ఉత్తరాది,లక్కీ నటించారు.
సాయి రామ్ దాసరి లైన్ ఇవ్వగా, విభు ప్రొడక్షన్ వారు నిర్మించిన ఈ చిత్రానికి,
రచన-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం
హర్షన్ చేశారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All