Homeటాప్ స్టోరీస్లాగిన్ మీడియా ప్రొడక్షన్ నెం 2 చిత్ర ప్రారంభోత్సవం..

లాగిన్ మీడియా ప్రొడక్షన్ నెం 2 చిత్ర ప్రారంభోత్సవం..

login media production no 2 film openingలాగిన్ మీడియా శ్రీధర్ రెడ్డి ఆశీస్సులతో బాలరాజు గౌడ్ సమర్పించు ప్రొడక్షన్ నెంబర్.2 సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ లోని బొడుప్పల్ లోని బంగారు మైసమ్మతల్లి దేవాలయం లో రాజకీయ ప్రముఖుల నడుమ ఘనంగా జరుపుకుంది.. అనంతరం ఎం.యస్.ఆర్. ఆధ్వర్యం లో… బైక్ ర్యాలీ ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి బొడుప్పల్ వరకు దాదాపు వెయ్యి మంది యూత్ బైక్ ర్యాలీని నిర్వహించారు.. ఈ సందర్భంలోనే ఈ నూతన చిత్రానికి సర్వే సత్యనారాయణ క్లాప్ నివ్వగా, సుధకర్ రెడ్డి ఎల్బీనగర్ ఎమ్ ఎల్ ఎ (మాజీ) కెమెరా స్విచ్ ఆన్ చేయగా, స్క్రిప్ట్ ను జగయ్య యాదవ్, బండారు లక్ష్మణ్ రెడ్డి అందించగా, మాజీ మేయర్ శ్రీమతి బండ కార్తీక రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు… అనంతరం

సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ… ప్రొడక్షన్ 2 సినిమా ఓపెనింగ్ ను ఇక్కడ ఈ అమ్మవారి దేవాలయంలో జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉంది.. యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని, ఇదువరకె ఈ బ్యానర్లో వచ్చిన హ్యాక్ డ్ బై డెవిల్ చిత్రం లా అవార్డులు సొంతం చేసుకోవాలని, సినిమాలో నటిస్తున్న నటీ నటులందరికీ మంచి పేరు రావాలని ఆశిస్తున్నా… అన్నారు.. సుదీర్ రెడ్డి మాజీ ఎమ్ ఎల్ ఎ మాట్లాడుతూ.. ముందు తీసిన సినిమా కంటే ఈ నూతన చిత్రం గొప్పగా ఉండాలని అందరికీ మంచి పేరు రావాలని కోరుతున్నా అన్నారు. డైరెక్టర్ కృష్ణ కార్తిక్ మాట్లాడుతూ… ఈ చిత్ర ఓపెనింగ్ కు వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇంత గొప్పగా ప్రారంబోత్సవం

- Advertisement -

జరుపుకుంటున్నందుకు హ్యాపీగా ఉంది. ప్రయోగాత్మక చిత్రాలనే ఎంకరేజ్ చేస్తున్న ఉదయ్ గారు మళ్లీ నాకు రెండవ అవకాశాన్ని ఇచ్చినందుకు థాంక్స్, రెగులర్ ఫార్మేట్ లో కాకుండా రియలిస్టిక్ గా కథను సినిమా గా రూపొందిస్తున్నాం, చెప్పాలంటే క్యూట్ లవ్ స్టొరీ, ప్రతి ఒక్కరి మనసును తాకే కథ. అందరి కథ ఈ సినిమా.. రియాలిస్టిక్ సినిమా కనుక నేచురల్ లుక్ కోసం లోకల్ హీరో ను తీసుకోవడం జరిగింది. తెలుగు ఆడియన్స్ కు గుర్తుండిపోయే ఆర్టిస్టులు అవుతారు.. ఏం తీశారురా అనే సినిమాల లిస్ట్ లోనికి ఈ చిత్రం చేరుతుంది. మన లోకల్ సినిమా కనుక తెలంగాణ లోని ప్రతి ప్రాంతంలోనూ షూట్ జరుపుకోనుంది.. నెక్స్ట్ వీక్ లో మొదటి షెడ్యూల్ ను ప్రారంభించి 35డేస్ లో షూట్ కంప్లీట్ చేసి రెండు నెలల్లో రిలీజ్ ప్లాన్ చేస్తాము.. మ్యూజిక్ ఈ చిత్రంలో ప్రధానం. అని తెలియచేసారు. బంగారు మైసమ్మ తల్లి టెంపుల్ లో పూజ నిర్వహించిన ఈ నూతన చిత్రం విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నా,

శ్రీరామ్ మాట్లాడుతూ….. ట్యాలెంట్ ను గుర్తించి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అని అన్నారు. హీరోయిన్ పల్లవి మాట్లాడుతూ స్టొరీ రియాలిస్టిక్ గా ఉంది. ఇన్స్ ఫైర్ చేసింది నన్ను.. ఇప్పటి జెనెరేషన్ కు గుణపాఠం లా ఉంటుంది ఈ చిత్రం అని చెప్పారు.

నిర్మాత ఉదయ్ భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ.. మా బ్యానర్లో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ నూతన చిత్రాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నా.. మంచి కథతో వస్తున్నాం ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.. ఈ కార్యక్రమంలో బండ కార్తీక మాజీ మేయర్, జంగయ్య యాదవ్, నరసింహ రెడ్డి మాజీ సర్పంచ్, బాలరాజు గౌడ్, సుదీర్ రెడ్డి మాజీ ఎమ్ ఎల్ ఏ, తదితర రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

శ్రీరామ్, పల్లవి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కన్నా కోటి, మ్యూజిక్: మహి మదన్ యం యం. కూర్పు: కె ఆర్. స్వామి, సమర్పణ: వై. బాలరాజు గౌడ్, సహా నిర్మాత: వినయ్ కుమార్ గౌడ్, నిర్మాత; ఉదయ్ భాస్కర్ గౌడ్, దర్శకత్వం: కృష్ణ కార్తిక్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All