
విజయ్ దేవరకొండ అండ్ కో ప్రస్తుతం యూఎస్ లో లాస్ వేగాస్ లో ఉన్న విషయం తెల్సిందే. తన తర్వాతి చిత్రం లైగర్ షూటింగ్ లో భాగంగా కొన్ని రోజుల క్రితం యూఎస్ వెళ్ళాడు విజయ్. బాక్సింగ్ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ లైగర్. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ప్రస్తుతం లైగర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బాక్సింగ్ లెజండ్ మైక్ టైసన్ ఈ చిత్రంలో స్పెషల్ పాత్రను పోషిస్తున్నాడు. నిన్నటి నుండే లైగర్ షూటింగ్ మొదలైంది. చూస్తుంటే లైగర్ టీమ్ షూటింగ్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. ముఖ్యంగా మైక్ టైసన్ వంటి లెజండ్ తో పని చేయడాన్ని ప్రతీ క్షణం ఆస్వాదిస్తున్నారు.
షూటింగ్ స్పాట్ నుండి ప్రతీ రోజూ ఫోటోలను షేర్ చేస్తున్నారు. నిన్న లైగర్ వెర్సస్ లెజండ్ ఫేస్ టు ఫేస్ అని ఒక ఫోటోను షేర్ చేయగా ఈరోజు మైక్ టైసన్ తో కోర్ టీమ్ అయిన విజయ్ దేవరకొండ, ఛార్మి, పూరి జగన్నాథ్, అనన్య పాండే ఫొటోస్ ను షేర్ చేసారు. ఈ ఫోటోలకు విజయ్ మ్యాజిక్ అని క్యాప్షన్ ను జత చేయడం విశేషం.
అనన్య పాండే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్యాన్ ఇండియా వైడ్ గా లైగర్ విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి:
లాస్ వేగాస్ లో చిల్ అవుతోన్న ‘లైగర్’ బాయ్స్
విజయ్ మాస్ డ్యాన్స్.. ముంబైలో లైగర్ సాంగ్ షూట్..!
Magic ✨ pic.twitter.com/UGtqiad0hM
— Vijay Deverakonda (@TheDeverakonda) November 17, 2021