Saturday, October 1, 2022
Homeటాప్ స్టోరీస్`లైగ‌ర్‌` నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ రేపే!

`లైగ‌ర్‌` నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ రేపే!

`లైగ‌ర్‌` నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ రేపే!
`లైగ‌ర్‌` నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్ రేపే!

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ `లైగ‌ర్‌`. పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ సోయ‌గం అన‌న్య పాండే హీరోయిన్ గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతోంది. బాక్సింగ్ నేప‌థ్యంలో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ద్వారా విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్‌కు ప‌రిచ‌యం కాబోతున్నారు.

- Advertisement -

ఈ చిత్రాన్ని క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తాతో క‌లిసి ఛార్మీ, పూరి జ‌గ‌న్నాథ్ నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఊహ‌ల‌కు అంద‌ని స్థాయిలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని పూరి తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్ర టైటిల్‌ని ప్ర‌క‌టించిన చిత్ర బృందం తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించ‌బోతున్నామంటూ బుధ‌వారం వెల్ల‌డించింది.

గురువారం ఉద‌యం 8:14 నిమిషాల‌కు ఈ చిత్ర పాన్ ఇండియా రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టిస్తామ‌ని ఛార్మీ, అన‌న్య పాండే ఓ వీడియోని రిలీజ్ చేశారు. ఇప్ప‌టికే స్టార్ హీరోలంతా త‌మ చిత్రాల రిలీజ్ డేట్‌లు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో `లైగ‌ర్‌` రిలీజ్ డేట్‌పై ఉత్కంఠ నెల‌కొంది. అది గురువారం ఉద‌యం 8:14 నిమిషాల‌కు రివీల్ కానుంద‌డంతో రౌడీ ఫ్యాన్స్ అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts