విజయదేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ లైగర్. ప్రస్తుతం సెన్సార్ కార్య క్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 25 న పాన్ ఇండియా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర మేకర్స్ ప్రమోషన్ ను ఓ స్థాయిలో జరుపుతున్నారు. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన ట్రైలర్ , సాంగ్స్ , టీజర్ ఆకట్టుకోగా..ఈరోజు సినిమాలోని ‘ఆ ఫత్..’ అనే రొమాంటిక్ సాంగ్ విడుదలైంది. ఈ రొమాంటిక్ సాంగ్‌లో విజయ్ దేవరకొండ, అనన్య పాండే రొమాన్స్ యూత్‌ను మెప్పించడం ఖాయంగా కనిపిస్తుంది.
బాబోయ్.. మామూలు డ్రామాలు కావు. అన్నీ లెక్కలేసుకొని నువ్ బకరా అని ఫిక్స్ అయినాకే నంబర్ ఇస్తాయి.. ఇంక వాట్సాప్ లు షురూ అవుతాయి చూడు.. నిద్ర పోనివ్వవు.. పనులు చేసుకోనివ్వవు.. ఇక బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్లే’ అంటూ అమ్మాయిల గురించి లైగర్ తల్లి రమ్యకృష్ణ హితబోధ చేస్తుండటంతో ‘ఆఫత్’ సాంగ్ ప్రారంభమవుతుంది. ‘తేనె కళ్ళతోటి పిల్లవాడు పట్టేసిండే.. మందు పెట్టేసిండే.. మంట పుట్టించిండే.. ప్రేమ జెండా తెచ్చి గుండెల్లోన నాటేసిండే.. నాలో దూరేసిండే.. నన్ను మార్చేసిండే..’ అంటూ సాగిన ఈ రొమాంటిక్ సాంగ్ అలరిస్తోంది. ఆఫత్’ సాంగ్ కు బాలీవుడ్ కంపోజర్ తనీష్ బాగ్చి ట్యూన్ సమకూర్చారు. గీత రచయిత భాస్కరభట్ల రవికుమార్ లిరిక్స్ రాయగా.. సింహా & శ్రావణ భార్గవి కలిసి హుషారుగా ఆలపించారు. పీయూష్-షాజియా డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు.