
ఒక్కోసారి మనం చేసే వ్యాఖ్యలు మనల్ని తిరిగి ఇబ్బందులకు గురి చేస్తాయి. ఏదైనా మాట అనడానికి సందర్భం చూసుకోవాలి అని అందుకే అంటారు. తమిళ స్టార్ హీరో ధనుష్ ఇటీవలే తమిళ నిర్మాతలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అది ధనుష్ సినిమాను విడుదల కాకుండా ఆపేలా కూడా చేస్తున్నాయి.
ధనుష్, మేఘ ఆకాష్, జంటగా తెరకెక్కిన తాజా చిత్రం ఎనై నోకి పాయం తోట. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ నిజానికి ఈ నెల 6న విడుదల కావాల్సి ఉంది. ఐతే కొన్ని లీగల్ సమస్యల కారణంగా ఇప్పుడు ఈ సినిమా అనుకున్న తేదీన విడుదల చేయలేకపోతున్నారు నిర్మాతలు. అయితే కనీసం శనివారమైనా విడుదల చేయాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి శనివారానికైనా ఈ చిత్రం బయటపడుతుందా లేదా అన్నది చూడాలి.
- Advertisement -
- Advertisement -