HomePolitical Newsమేకపాటి గౌతమ్‌ రెడ్డికి నివాళ్లు అర్పిస్తున్న నేతలు

మేకపాటి గౌతమ్‌ రెడ్డికి నివాళ్లు అర్పిస్తున్న నేతలు

Leaders paying tribute to Mekapati Gautam Reddy
Leaders paying tribute to Mekapati Gautam Reddy

వైసీపీ పార్టీ లో విషాద ఛాయలు అల్లుకున్నాయి.  గుండెపోటుతో ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి(50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం గుండెపోటు రావడం తో వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రి కి తరలించారు. హాస్పటల్ కు వెళ్లే లోపు ఆయన మృతి చెందారు. ఈయన మరణ వార్త విని రాజకీయ నేతలే కాదు ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. గౌతమ్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

గౌతమ్ రెడ్డి హఠాన్మరణం గురించి తెలుసుకొని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అనిల్ …ఓ మంచి స్నేహితుడు.. అన్నను కోల్పోయానన్నారు.

- Advertisement -

చిన్న వయస్సులోనే గౌతమ్ రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఏపీ ఐటి రంగంలో అభివృద్ధి చేసిన మేకపాటి గౌతంరెడ్డి మరణం బాధాకరమని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు.. అభివృద్ధి చెందుతున్న ఏపీకి తీరని లోటు అవంతి పేర్కొన్నారు. సహచర మంత్రిగా స్నేహితునిగా ఆయన మరణం ఊహించుకోలేక  పోతున్నామన్నారు. రాష్ట్ర ఐ.టి.శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నూజివీడు ఎమ్మెల్యే మేకాప్రతాప్ ప్రతాప్ అప్పారావు.

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ. ఆయన అకాలమరణం పార్టీకి తీరని లోటు. ఒక సమర్థవంతమైన నాయకుడిని కోల్పోయాం అన్నారు.

మంత్రి గౌతమ్ రెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు డిప్యూటీ CM నారాయణ స్వామి. చిన్నతనంలోనే గౌతమ్ రెడ్డి కేబినెట్లో ప్రత్యేక స్థానం పొందారన్నారు నారాయణ స్వామి. మేకపాటి గౌతమ్‌రెడ్డి కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు లోకేష్, సోమిరెడ్డి సంతాపం తెలిపారు. ఆయన హఠాన్మరణంపై చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.  ఇక మరికాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ కు రాబోతున్నారు.

మాజీ ఎంపీ రాజమోహన్‌రెడ్డి కుమారుడు గౌతమ్‌రెడ్డి. 1971 నవంబర్‌2న జన్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికలతో గౌతమ్‌ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. నెల్లూరు జిల్లా అత్మకూరు నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. రెండుసార్లు ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచారు. 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All