Homeగాసిప్స్గ్యాప్ రాలేదు తీసుకున్నా అంటున్న లావణ్య

గ్యాప్ రాలేదు తీసుకున్నా అంటున్న లావణ్య

గ్యాప్ రాలేదు తీసుకున్నా అంటున్న లావణ్య
గ్యాప్ రాలేదు తీసుకున్నా అంటున్న లావణ్య

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన లావణ్య త్రిపాఠి చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది . అయితే ఆమె చాలా తక్కువ సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించడం వల్ల ఆమె కెరీర్ ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళలేదు. లావణ్య త్రిపాఠి కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ అంటే భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన మాత్రమే. ఈ రెండు చిత్రాలు భారీ సక్సెస్ సాధించినా దాని చుట్టూ వచ్చిన ప్లాప్స్ ఆమె కెరీర్ ను దెబ్బ తీశాయి. అందం, అభినయం రెండూ ఉన్నా కూడా లావణ్య కెరీర్ సక్సెస్ లేని కారణంగానే ముందుకు వెళ్ళలేదు. దీంతో ప్రస్తుతం లావణ్య త్రిపాఠి కెరీర్ లో సినిమాలే లేవు. ఎన్నో ఆశలు పెట్టుకున్న అర్జున్ సురవరం ఏడాది పాటు వాయిదా పడడంతో బజ్ మొత్తం పోయింది. దీంతో ఈ సినిమా వల్ల లావణ్యకు పెద్ద ఒరిగేదేమి లేదు.

అయినా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం లావణ్య హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా మీడియా ఆమె చేతిలో సినిమాలు లేవన్న విషయాన్ని గుర్తు చేసారు. అయితే లావణ్య త్రిపాఠి ఈ విషయాన్ని చాలా కూల్ గా తీసుకుంది. తనకు సినిమాలు లేకపోవడం కాదు, తనకే వచ్చిన స్క్రిప్ట్ లు నచ్చక చేయలేదు అంటోంది. తనకు ఈ నెంబర్ రేస్ ల పట్ల నమ్మకం లేదని, చేసిన రెండు, మూడు సినిమాలు నిలిచిపోవాలని కోరుకుంటున్నా అంటోంది. నా కెరీర్లో గ్యాప్ రాలేదు.. కావాలని నేనే గ్యాప్ తీసుకున్నా అంటోంది లావణ్య. ఇదంతా బానే ఉంది కానీ అసలు వచ్చిన ప్రాజెక్ట్ లు వద్దనేంత రేంజ్ లో లావణ్య ఉందా అనేది అసలు డౌట్.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All