
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ గత రెండేళ్ల విరామం తరువాత మళ్లీ సినిమాల్లో బిజీగా మారిపోయారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బోనీ కపూర్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా బ్యాలెన్స్‌గా వున్న షూటింగ్‌ని ఏప్రిల్‌లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
మే 15న రిలీజ్ చేయాలన్నది దిల్ రాజు ప్లాన్. కానీ కరోనా ఎఫెక్ట్ కారణంగా లాక్ డౌన్ ఏప్రిల్ 15 వరకు ఉండటంతో షూటింగ్ కూడా ఆపేశారు. దీంతో ఈ సినిమా రిలీజ్ మరింత వెనక్కి వెళ్లేలా కనిపిస్తోంది. ఇదిలా వుంటే క్రిష్ డైరెక్షన్‌లో చేస్తున్న పిరియాడిక్ చిత్రంతో పాటు పవన్ మైత్రీ మూవీమేకర్స్ చిత్రాన్ని కూడా అంగీకరించిన విషయం తెలిసిందే.
హరీష్ శంకర్ తెరకెక్కించనున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గతంలో మైత్రీ దగ్గర పవన్ అడ్వాన్స్ తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ చిత్రాన్ని హరీష్ శంకర్‌తో చేయడానికి అంగీకరించారు. ఇందులో పవన్‌కు జోడీగా `అందాల రాక్షసి` ఫేమ్ లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసినట్టు తెలిసింది. గత కొంత కాలంగా బిగ్ సినిమా ఛాన్స్ దక్కించుకోలేకపోయిన లావణ్యకు నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే.