Homeటాప్ స్టోరీస్లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ

lakshmi’s ntr movie reviewలక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ :
నటీనటులు: పి. విజయ్ కుమార్ , యజ్ఞ శెట్టి , శ్రీ తేజ్
సంగీతం : కల్యాణి మాలిక్
నిర్మాత : రాకేష్ రెడ్డి
దర్శకత్వం : రాంగోపాల్ వర్మఅగస్త్య మంజు
రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్ : 29 మార్చి 2019

 

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి యన్ టి రామారావు ఓడిపోయిన తర్వాత అతడి జీవితంలోకి  లక్ష్మీపార్వతి వస్తుంది. జీవిత కథ రాస్తానని వచ్చిన  లక్ష్మీపార్వతి ని పెళ్లి చేసుకోవడానికి గల కారణాలతో రూపొందిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ .  నాటకీయ పరిస్థితుల మధ్య  ఈరోజు   విడుదలైన  ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? చూద్దామా !

కథ :

ఎన్టీఆర్ ఆత్మకథ రాస్తానని వచ్చిన లక్ష్మీపార్వతి ఒంటరిగా జీవిస్తున్న ఎన్టీఆర్ కు బాగా దగ్గరౌతుంది. దాంతో లక్ష్మీపార్వతి ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఎన్టీఆర్. అయితే లక్ష్మీపార్వతి ని పెళ్లిచేసుకోవడం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఇష్టం ఉండదు. అయినప్పటికీ కుటుంబ సభ్యులను ఖాతరు చేయకుండా పెళ్లిచేసుకుంటాడు ఎన్టీఆర్. దాంతో బాబుకి  ఈ పెళ్లికి ఇష్టం ఉండదు. పైగా లక్ష్మీపార్వతి ప్రమేయమెక్కువ కావడంతో బాబు కుట్ర పన్ని ఎన్టీఆర్ ని పదవి నుండి దించేస్తాడు.

నటీనటుల ప్రతిభ:

ఎన్ టి   రామారావు గా  నాటక రంగానికి చెందిన విజయ్ కుమార్ బాగా నటించాడు. ఎన్టీఆర్ మేనరిజం ని  విజయ్ కుమార్  బాగా అనుకరించాడు.  లక్ష్మీపార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి బాగా  నటించింది. ఆ పాత్రలో యజ్ఞ శెట్టి ని తప్ప మరొకరిని ఊహించలేం.  ఇక మరో కీలకపాత్ర బాబు ది. ఆ పాత్రలో శ్రీ తేజ్ అదరగొట్టాడు. అచ్చం చంద్ర బాబు ని తలపించాడు . ఇకమిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం :

రాంగోపాల్ వర్మ – అగస్త్య మంజు లు సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడిగా వర్మ పూర్తి న్యాయం చేశాడు. వర్మ చిత్రం అనగానే ఓ ముద్ర పడింది అయితే ఆ ముద్ర చేరిపేయడానికి బాగానే శ్రమించాడు వర్మ. విజువల్స్ బాగున్నాయి. అప్పటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించారు.

ఓవరాల్ గా :

లక్ష్మీస్ ఎన్టీఆర్ తప్పకుండా ఓసారి చూడొచ్చు.

English Title : lakshmi’s ntr movie review

Click here for English Review

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All