Homeటాప్ స్టోరీస్తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారం : లగడపాటి

తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారం : లగడపాటి

Lagadapati Rajagopal telangana survey outతెలంగాణ లో షాకింగ్ రిజల్ట్స్ రాబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేసాడు లగడపాటి రాజగోపాల్ . ఇటీవల తిరుపతి వెళ్లిన లగడపాటి రాజగోపాల్ అక్కడ తెలంగాణ లో ఇద్దరు ఇండిపెండెంట్లు ఎన్నికల్లో గెలవబోతున్నారని ప్రకటించిన లగడపాటి తాజాగా ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణలో గెలవబోయే మరో ముగ్గురు సభ్యుల పేర్లను ప్రకటించాడు . ఇబ్రహీం పట్నం నుండి మల్ రెడ్డి రంగారెడ్డి గెలవబోతున్నాడని , బెల్లంపల్లి లో గడ్డం వినోద్ , మక్తల్ లో జలంధర్ రెడ్డి గెలుస్తున్నారని తెలిపాడు . అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితి అయితే కేంగ్రెస్ నేతృత్వం లోని మహా కూటమి గెలవబోతుందని స్పష్టం చేసాడు .

అయితే ఓటింగ్ పెరిగితే ఒకలా ఓటింగ్ తగ్గితే మరోలా ఈ రిజల్ట్ ఉంటుందని టీఆర్ఎస్ కు అనుకూల వాతావరణం లేదని , వరంగల్ , నిజామాబాద్ , మెదక్ లలో మాత్రమే టీఆర్ఎస్ కు ఓటర్లు మొగ్గు చూపిస్తున్నారన్నారు . కాంగ్రెస్ పార్టీ కి ఖమ్మం , ఆదిలాబాద్ , రంగారెడ్డి , నల్గొండ జిల్లాలలో అనుకూలంగా ఉందని కరీంనగర్ , మహబూబ్ నగర్ లలో కాంగ్రెస్ – టీఆర్ఎస్ పోటాపోటీ ఉంటుందని హైదరాబాద్ లో మాత్రం ఎం ఐ ఎం ఆధిక్యత సాధిస్తుందని మొత్తానికి కాంగ్రెస్ కూటమి కె విజయావకాశాలు ఉన్నాయని స్పష్టం చేసాడు లగడపాటి . అయితే పూర్తిస్థాయి ఫలితాలను మాత్రం డిసెంబర్ 7న వెల్లడిస్తానని అన్నాడు లగడపాటి . మొత్తానికి లగడపాటి సర్వేలతో టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయంగా కనిపిస్తోంది .

- Advertisement -

English Title: Lagadapati Rajagopal telangana survey out

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All