Homeన్యూస్లడ్డుండ సాంగ్: స్వర్గంలో బంగార్రాజు హవా

లడ్డుండ సాంగ్: స్వర్గంలో బంగార్రాజు హవా

 

Laddunda song from bangarraju is out
Laddunda song from bangarraju is out

అక్కినేని నాగార్జున కెరీర్ లో సోగ్గాడే చిన్ని నాయన అనేది చాలా స్పెషల్ చిత్రం. ఎక్కువ హడావిడి లేకుండా విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి పెర్ఫర్మ్ చేసింది. నాగ్ కెరీర్ లోన అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. మళ్ళీ ఐదేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రూపొందబోతోంది. సోగ్గాడే.. లో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్రనే ఈ చిత్రానికి టైటిల్ గా ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈరోజు నుండి మైసూర్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది.

- Advertisement -

ఇదిలా ఉంటే బంగార్రాజు నుండి మొదటి సాంగ్ లడ్డుండను విడుదల చేసారు. 80,90 లలో ఫేమస్ అయిన ఒక చిన్న లైన్ లడ్డుండను తీసుకుని ఈ సాంగ్ ను రూపొందించారు. స్వర్గంలో బంగార్రాజు ఈ సాంగ్ తో రచ్చ చేస్తాడని తెలుస్తోంది. రంభ, ఊర్వశి, మేనకలతో బంగార్రాజు లడ్డుండ సాంగ్ ను వేసుకుంటున్నాడు.

ఈ పాటను నాగార్జునతో పాటు ధనుంజయ్, మోహన భోగరాజు, హరిప్రియ, నూతన మోహన్ ఈ పాటను పాడారు. భాస్కరభట్ల రవికుమార్ ఈ సాంగ్ కు సాహిత్యాన్ని అందించాడు. కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ఫీమేల్ లీడ్ గా కనిపిస్తుంది. అలాగే నాగ చైతన్య, కృతి శెట్టి మరో లీడ్ పెయిర్ గా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా నాగార్జున, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All