
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ మూవీ భారీ అంచనాల నడుమ ఈ నెల 25 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. వాస్తవానికి జనవరి సంక్రాంతి రేస్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసినప్పటికీ పలు కారణాల కారణంగా ఫిబ్రవరి 25 కు వాయిదా పడింది. మొన్నటి వరకు కూడా ఈ డేట్ కు వస్తుందో రాదో అనే అనుమానులు ఉండేవి కానీ మేకర్స్ మాత్రం చెప్పిన తేదీకే రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ పూర్తి చేసిన మేకర్స్ , ప్రమోషన్ ఫై దృష్టి సారించారు.
ఈ క్రమంలో రేపు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. ఇక ముఖ్య అతిధిగా ఎవరు వస్తారో అని అంత మాట్లాడుకుంటున్న వేళా తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ వస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. కేటీఆర్ తో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరుకాబోతున్నారు. తెలంగాణ మంత్రులు ఒకే మరి ఏపీ సంగతి ఏంటి అని అంత మాట్లాడుకుంటున్నారు. పవన్ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో తన పార్టీ ఫై ప్రత్యేక దృష్టి పెట్టకపోయినా ఏపీ లో మాత్రం తనదైన మార్క్ చూపిస్తున్నాడు. వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా పవన్ నడుస్తూవస్తునాడు. ఈ మధ్యనే జీవో 35 ని తీసుకొచ్చిన ఏపీ సర్కార్ ఫై ఆగ్రహం వ్యక్తం చేయడం..వైసీపీ నేతలు సైతం పవన్ కౌంటర్లు ఇవ్వడం ఇలా చాలానే జరిగాయి. రీసెంట్ గా చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం ఇటీవల అమరావతికి వెళ్లి సీఎం జగన్ కు కృతఙ్ఞతలు చెప్పిరావడం.. ప్రభుత్వ కమిటీ నివేదిక రెడీ చేయడం వంటివి ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
టాలీవుడ్ పెద్దలు ఆశించినట్లు టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వ జీవో వచ్చే వారంలోపు వస్తే.. అది అందరి కంటే ముందే పవన్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాకే ప్లస్ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ నుంచి ఎవరైనా ఆహ్వానిస్తారేమో అని చర్చలు జరుగుతున్నాయి. నిజంగా వస్తే ఈ పాటికే చిత్ర మేకర్స్ తెలిపే వారు ఆలా తెలుపలేదు అంటే ఎవరు రావడం లేదని అర్ధం అవుతుంది.
#BheemlaNayak Pre-Release event will be held on 21st Feb!?
Young & dynamic leader Shri. @KTRTRS garu will grace the event? #BheemlaNayakOn25thFeb @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @vamsi84 @venupro pic.twitter.com/X1nPJphbrz
— BA Raju’s Team (@baraju_SuperHit) February 19, 2022