Homeటాప్ స్టోరీస్'కె ఎస్ 100' ట్రైలర్ విడుదల

‘కె ఎస్ 100’ ట్రైలర్ విడుదల

KS 100 Movie Trailer Launchచంద్ర శేఖర్ మూవీస్ పతాకం పై సమీర్ ఖాన్, శైలజ, సునీత పాండే, ఆశి రాయ్, శ్రద్ధ, అక్షత ప్రధాన
పాత్రదారులుగా కె. వెంకట్ రామ్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కె ఎస్ 100‘. షేర్ దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్ నిర్మాత సాయి వెంకట్, మల్టీ డీమెన్షన్ వాసు, అట్లూరి రామకృష్ణ లచే విడుదలైంది. ఈ సందర్భంగా మొదట నిర్మాత వెంకట రామ్ రెడ్డి మాట్లాడుతూ … మంచి హర్రర్ థ్రిల్లర్ రొమాంటిక్ మూవీ. సినిమా చాలా బాగొచ్చింది. అందరికీ నచ్చి తీరుతుందని ఆశిస్తున్నా అన్నారు.

- Advertisement -

హీరోయిన్ సునీత పాండే మాట్లాడుతూ.. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు. ఇదివరకు భోజ్ పూరి, పంజాబి సినిమాల్లో నటించాను. తెలుగులో ఇదే నా మొదటి సినిమా.. సౌత్ ఇండస్ట్రీ లో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా… ఇప్పటికి నెరవేరింది. తెలుగు ఇండస్ట్రీ రియల్లీ వండర్ఫుల్. చాలా సపోర్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో నా పాత్ర చాలా చాలెంజింగ్ గా ఉంటుంది.. వందశాతం న్యాయం చేశానని అనుకుంటున్నాను.. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా, మ్యూజిక్ చాలా బాగొచ్చింది. మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు. హీరోయిన్ శైలజ మాట్లాడుతూ మంచి స్టోరీ తో తెలుగు ఇండస్ట్రీ కు పరిచయం అవుతున్నా.. గ్రేట్ ఎక్స్పీరియన్స్ ను పొందాను. అందరూ ఎంతో సపోర్ట్ అందించారు. షేర్ గారికి నా కృతజ్ఞతలు అని అన్నారు.

హీరో సమీర్ ఖాన్ మాట్లాడుతూ.. యాక్టర్ అవ్వాలనే నా డ్రీమ్ నెరవేరింది. మంచి సబ్జెక్టు తో ఇంట్రడ్యూస్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. షేర్ గారు మాకెంతో సపోర్ట్ ను అందించారు. ప్రూవ్ చేసుకునే పాత్ర నాకు అందించినందుకు ఆయన నా స్పెషల్ థాంక్స్. టీమ్ అంతా హార్డ్ వర్క్ చేసాము.. మరిన్ని మంచి సినిమాలతో ఇండస్ట్రీలో కొనసాగాలనుకుంటున్నా. తెలుగు ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు అని తెలిపారు.

దర్శకుడు షేర్ మాట్లాడుతూ.. నా పేరు షిరాజ్.. కానీ ఎవరికీ పలకడం రావడం లేదనే షేర్ అని మార్చుకున్నా.. ఇక సినిమా విషయానికి వస్తే 3ఇయర్స్ నుంచి అనుకుంటున్నా ఈ కథను. మొదట ఒక లైన్ చెప్పగానే నిర్మాత వెంకట్ రెడ్డి గారికి బాగా నచ్చి సినిమా చేద్దామని చెప్పారు. ఈ సబ్జెక్టు యాప్ట్ అవ్వాలనే నలుగురు అందమైన అమ్మాయిలను వెతికి వెతికి మరీ ఈ సినిమాలో పెట్టడం జరిగింది. అంతేకాదు ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా విడుదల చేయాలనే ప్లాన్ లో కూడా ఉన్నాము. సినిమాలో వీరి పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఎవారూ పాత్రలు కాదు.. అందరూ హీరోయిన్సే.. హీరో సమీర్ ఖాన్ యాక్టింగ్ మెచూర్డ్ గా ఉంటుంది.. కొత్త అన్నట్టుగా ఎక్కడా కనిపించదు.. కథ విషయానికి వస్తే.. ఈ తరం అమ్మాయిలు ఏవిధంగా ఫాస్ట్ కల్చర్ ను అలవర్చుకున్నారు అనే విధంగా తెరకెక్కించడం జరిగింది. కె ఎస్ అంటే హీరోల పాత్ర పేరు కుమార్ స్వామి, ఇక 100 అంటే వాళ్ళ వందరోజుల స్నేహమే… కథ చాలా బాగా వచ్చింది. చాలా డిఫ్ఫరెంట్ స్టోరీ. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ అని చెప్పొచ్చు. సస్పెన్స్ త్రిల్లర్ తో సినిమాను తెరకెక్కించాము కనుక చూస్తున్న ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా బయటికి పోకుండా సినిమా పూర్తయ్యే వరకు థియేటర్ లోనే ఉండిపోతారు. అంత నమ్మకంగా చెప్పగలను ఈ సినిమా గురుంచి. నేను ఎప్పుడూ ప్లాప్ సినిమా చేయకూడదని తాపత్రయ పడుతాను. ఆ కసి లో నుంచి పుట్టిందే ఈ ‘కె ఎస్ 100’ చిత్రం. టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు కనుక వీరితో మరో సినిమా ప్లాన్ చేసేసాము, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సాయి వెంకట్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ సినిమా లోకం అంటే ఏంటో ఆయనే నాకు చూపించారు అని చెప్పారు. అతిథి సాయి వెంకట్ మాట్లాడుతూ.. షిరాజ్ కాన్ఫిడెంట్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అతనికి సినిమా తీయడమే కాకుండా ఎలా ప్రమోట్ చేయాలో కూడా బాగా తెలిసిన వ్యక్తి. ప్రేక్షకులని కూర్చోపెట్టారంటే ఆ టాలెంట్ ఒక్క దర్శకుడే ఉంటుంది. అది షిరాజ్ కు ఉంది. హీరో గా పరిచయం అయ్యి దర్శకుడిగా మంచి ప్రతిభను కనబరుస్తున్నాడు. ఈ ట్రైలర్ చూసాక అర్థం అయ్యింది. కె ఎస్ 100 కు సీక్యూల్ గా సినిమాలు చాలా వస్తాయనే నమ్మకం నాకుంది.. టోటల్ టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ అని తెలియచేసారు.

 

అక్షత, కూసెట్టి, అజీబ్, సంగీత దర్శకుడు నవనీత్ చారి, శ్రద్ధ, చైల్డ్ ఆర్టిస్ట్ పూర్వి, రామకృష్ణ అట్లూరి, తదితరులు పాల్గొన్నారు.

 

సమీర్ ఖాన్, శైలజ, సునీత పాండే, అక్షత, ఆశి రాయ్, శ్రద్ధ, అజీమ్, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వంశీ, ఎడిటర్: నాగార్జున, యాక్షన్: మల్లేష్, వి ఎఫ్ ఎక్స్: ప్రవీణ్, కోరియోగ్రఫీ: జోజో, మ్యూజిక్: నవనీత్ చారి, లిరిక్స్: భాస్కర్ బట్ల, నిర్మాత: కె. వెంకట రామి రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై పోశెట్టి, స్టోరీ- డైలాగ్స్- స్క్రీన్ ప్లే- డైరెక్షన్: షేర్.

SUBSCRIBE TO TOLLYWOOD VIDEO CHANNEL :https://goo.gl/DBvfV4

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts