విజయ్ సేతుపతి , సమంత , నయనతార లు ప్రధాన పాత్రల్లో విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ కాతువాకుల రెండు కాదల్. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను తమిళం, తెలుగు భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో అన్ని భాషల్లో ప్రమోషన్ కార్య క్రమాలను స్పీడ్ చేసారు. ఇప్పటికే తమిళంలో పలు సాంగ్స్ , రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేసి ఆకట్టుకోగా..తాజాగా తెలుగు లో ట్రైలర్ విడుదల చేసి ఆసక్తి పెంచారు.
తెలుగులో ‘కన్మణి రాంబో ఖతీజ’ పేరుతో థియేటర్లలో విడుదల కానుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. కన్మణిగా నయనతార, ఖతీజ పాత్రలో సమంత.. ఇక రాంబోగా విజయ్ సేతుపతి కామెడీ పండించనున్నారు.
