Homeటాప్ స్టోరీస్స‌ల్మాన్ సినిమాని ఆడేసుకున్నాడుగా!

స‌ల్మాన్ సినిమాని ఆడేసుకున్నాడుగా!

KRK shere negative rieview on dabangg 3
KRK shere negative rieview on dabangg 3

స‌ల్లూ భాయ్ స‌ల్మాన్‌ఖాన్ సినిమా `ద‌బాంగ్‌3`పై భారీ అంచ‌నాలు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. సినిమా పై వున్న క్రేజ్‌తో తొలిసారి తెలుగులోనూ రిలీజ్ చేస్తూ త‌న పాత్ర‌కు స్వ‌యంగా తానే డ‌బ్బింగ్ చెప్పుకున్నారు స‌ల్మాన్‌ఖాన్‌. `వాంటెడ్‌` వంటి హిట్ చిత్రం త‌రువాత ప్ర‌భుదేవా, స‌ల్మాన్‌ఖాన్ క‌లయిక‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో బాలీవుడ్‌తో పాటు దేశ వ్యాప్తంగా `ద‌బంగ్ 3`పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమాపై నెగెటివ్ ప్ర‌చారం మొద‌లైంది.

డిసెంబ‌ర్ 20న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో `ద‌బాంగ్ 3` రిలీజ్ కానుంది. అయితే ఒక రోజు ముందుగానే దుబాయ్‌లో ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రీమియ‌ర్ షో ప‌డింది. ముంబైలో ఈ రోజు రాత్రి 8 గంట‌ల‌కు సెల‌బ్రిటీస్ కోసం ప్రీమియ‌ర్ షోని పీవీఆర్ థియేట‌ర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే `ద‌బాంగ్‌2` వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్‌ని దుబాయ్‌లో చూసిన బాలీవుడ్ వివాదాస్ప‌ద క్రిటిక్ క‌మ‌ల్ ఆర్ ఖాన్ సినిమాపై అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

- Advertisement -

ట్విట్టర్‌లో వ‌రుస ట్వీట్ల‌తో నెగెటివ్ ప్ర‌చారం మొద‌లుపెట్టారు. `సినిమా తొలి గంట ఏం జ‌రుగుతుందో అర్థం కాకుండా వుంది. సినిమా ఏదో అనుకుంటే టార్చ‌ర్ చూపించింది. ఇంట‌ర్వెల్‌కే హీరోయిన్ స‌యీ మంజ్రేక‌ర్‌ని విల‌న్ చంపేశాడు. సినిమాలో 25 ఏళ్ల చుల్‌బుల్ పాండే ఇంకా జాబ్ లెస్‌గానే తిరుగుతుంటాడు. ఇదేం జోక్ స‌ల్మాన్ జీ, 90వ ద‌శ‌కంలో రిలీజ్ చేయాల్సింది రిక్షావాలాలు ఎంజాయ్ చేసేవారు` అంటూ క‌మ‌ల్ ఆర్ ఖాన్ `ద‌బాంగ్ `పై విరుచుకున‌డ్డారు. అయ‌న పెట్టిన ట్వీట్‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ట్వీట్‌ల‌పై స‌ల్మాన్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All