
సంచలన చిత్రం `ఉప్పెన`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి. తను నటించిన తొలి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడం, వంద కోట్ల క్లబ్‌లో చేరడం తెలిసిందే. దీంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీలో కృతిశెట్టి కళ్లతో పలికించిన భావాలకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో తొలి చిత్రంతోనే స్టార్ హీరోయిన్‌ల తరహాలో పాపులారిటీని సొంతం చేసుకుంది.
బేబమ్మగా ఆకట్టుకున్న కృతి శెట్టి ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న `శ్యామ్ సింగరాయ్`, రామ్‌తో ఎన్. లింగుసామి రూపొందించనున్న చిత్రం, సుధీర్‌బాబు హీరోగా ఇంద్రగంటి రూపొందిస్తున్న `ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి వంటి చిత్రాల్లో నటిస్తోంది. మరి కొంత మంది కృతిని తమ చిత్రాల్లో నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే తనకున్న డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని బేబమ్మ నిర్మాతలకు తన యాటిట్యూడ్‌ని చూపిస్తోందట. కోటి డిమాండ్ చేస్తున్న ఈ వయ్యారి అంతకు మించి కావాలని డిమాండ్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.