
ఎనర్జిటిక్ స్టార్ రామ్ స్పీడు పెంచారు. ఇంత వరకు క్లాస్ చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకున్న రామ్ `ఇస్మార్ట్ శంకర్` బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నుంచి మాస్ జపం చేస్తున్నారు. వరుసగా మాస్ మసాలా చిత్రాల్నే ఎంచుకుంటున్నారు. `రెడ్` వంటి థ్రిల్లర్ ఆశించిన ఫలితాన్ని అందించకపోవడంతో మరో హైఓల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
పందెంకోడి, ఆవారా వంటి సూపర్ హిట్ యాక్షన్ చిత్రాల దర్శకుడు ఎన్. లింగుసామి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.6గా తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ మూవీ రూపొందనుంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా త్వరలో సెట్స్ పైకి రానున్న ఈ మూవీలో హీరో రామ్‌కు జోడీగా టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి నటించబోతోంది.
ఈ విషయాన్ని మేకర్స్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఇది రామ్ నటించనున్న 19వ చిత్రం. యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఎన్. లింగుసామి ఈ చిత్రాన్ని హైటెక్నికల్ వాల్యూస్‌తో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని చిత్ర బృందం త్వరలోనే ప్రకటించనుంది.
Welcome on board #RAPO19 sweets! 🙂 https://t.co/XsGzwD3cTn pic.twitter.com/8UFXdSwkwZ
— RAm POthineni (@ramsayz) March 5, 2021