Homeగాసిప్స్ఉప్పెన భామ మెగా ఛాన్స్ కొట్టేసిందా?

ఉప్పెన భామ మెగా ఛాన్స్ కొట్టేసిందా?

ఉప్పెన భామ మెగా ఛాన్స్ కొట్టేసిందా?
ఉప్పెన భామ మెగా ఛాన్స్ కొట్టేసిందా?

ఉప్పెన చిత్రంతో సెన్సేషనల్ డెబ్యూ చేసింది బీబమ్మ కృతి శెట్టి. తన మొదటి చిత్రంతో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చింది. ఉప్పెన విడుదలై సూపర్ హిట్ కొట్టాక కృతి శెట్టికి వరస అవకాశాలు క్యూ కట్టాయి. నాని సరసన శ్యామ్ సింగ రాయ్ లో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అలాగే సుధీర్ బాబు హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కూడా ఒక చిత్రాన్ని చేస్తోంది కృతి. నితిన్ నెక్స్ట్ సినిమాలో కూడా కృతినే హీరోయిన్. అలాగే రామ్ నటిస్తోన్న తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రంలో కూడా ఈ భామనే తీసుకున్నారు. నాగార్జున హీరోగా నటిస్తోన్న బంగార్రాజులో నాగ చైతన్య సరసన కూడా నటిస్తోంది.

ఇంత బిజీగా ఉన్న కృతి శెట్టి కెరీర్ లో ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సినిమా చేయబోతోందిట. ఏ హీరోయిన్ కైనా తనపై నడిచే కథ, అంటే లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ చేయాలనే ఉత్సాహం కచ్చితంగా ఉంటుంది. కెరీర్ మొదట్లోనే కృతికి ఈ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి కూతురు సుస్మిత ఒక ప్రొడక్షన్ హౌజ్ ను నెలకొల్పిన సంగతి తెల్సిందే. ఆ బ్యానర్ లో ఒక వెబ్ సిరీస్ ను కూడా తీస్తున్నారు.

- Advertisement -

అయితే ఈ ప్రొడక్షన్ హౌజ్ పై సినిమాలను కూడా తీస్తారట. తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందనున్న ఈ లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లో ప్రధాన పాత్రలో కృతి అయితే బాగుంటుందని వారు భావిస్తున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుంది.

ఇవి కూడా చదవండి:

బేబమ్మా.. అప్పుడే లిప్ లాక్ ఏంటమ్మా..?

జీ టివితో సూపర్బ్ డీల్ సెట్ చేసుకున్న కృతి శెట్టి

ఫస్ట్ లుక్: బంగార్రాజులో నాగలక్ష్మిగా కృతి శెట్టి

నాని మాస్ లుక్ తో శ్యామ్ సింగ రాయ్ టీజర్ అప్డేట్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All