
సంగీతం : హిప్ హాప్ తమిళ
నిర్మాతలు : సాహు గారపాటి , హరీష్ పెద్ది
దర్శకత్వం : మేర్లపాక గాంధీ
రేటింగ్ : 2. 75/ 5
నాని ద్విపాత్రాభినయం పోషించిన కృష్ణార్జున యుద్ధం ఈరోజు విడుదల అయ్యింది . మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాహు , హరీష్ లు సంయుక్తంగా నిర్మించారు . మరి ఈరోజు విడుదలైన ఈ కృష్ణార్జున యుద్ధం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .
కథ :
చిత్తూర్ జిల్లా లోని ఓ గ్రామంలోని యువకుడు కృష్ణ (నాని ) . అమ్మాయిలను తన వలలో వేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు . అదే సమయంలో రాక్ స్టార్ అయిన అర్జున్ ( నాని ) చాలా ఇన్నోసెంట్ . ప్రపంచ వ్యాప్తంగా షోలు ఇస్తుంటాడు . ఇద్దరు కూడా ఒకేలా ఉన్నప్పటికీ ఎటువంటి రక్తసంబంధం లేని వ్యక్తులు . కాగా కృష్ణ రియా ( రుక్సార్ ) ని ప్రేమిస్తుంటాడు అర్జున్ ఏమో సుబ్బలక్ష్మి ( అనుపమ పరమేశ్వరన్ ) ని లవ్ లో పడెయ్యడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు . కృష్ణా- రియా , అర్జున్ – సుబ్బలక్ష్మి ల ప్రేమ వ్యవహారం అంతా సవ్యంగా ఉంది అనుకున్న సమయంలో ఊహించని మలుపు తిరుగుతుంది , దాంతో కృష్ణార్జునుల కథ ఎలాంటి మలుపు తిరిగింది . చివరకు ఏమయ్యింది అన్న విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
హైలెట్స్ :
నాని ద్విపాత్రాభినయం
చిత్తూర్ స్లాంగ్ లో నాని అభినయం
ఎంటర్ టైన్ మెంట్
డ్రా బ్యాక్స్ :
సినిమా నిడివి
సెకండాఫ్ లో రొటీన్ సీన్స్
నటీనటుల ప్రతిభ :
నాని ఈ చిత్రాన్ని తన భుజస్కంధాలపై మోసాడంటే నమ్మండి , అంతగా తన నటనతో ఆకట్టుకున్నాడు ముఖ్యం గా చిత్తూర్ స్లాంగ్ లో నాని అభినయం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది . కృష్ణ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న నాని అర్జున్ పాత్రలో కూడా మెప్పించాడు . అనుపమ పరమేశ్వరన్ , రుక్సార్ లకు కూడా మంచి పాత్రలు లభించాయి . ఇతర పాత్రల్లో బ్రహ్మాజీ తో పాటుగా మిగతా పాత్రధారులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు .
సాంకేతిక వర్గం :
షైన్ స్క్రీన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి , కథ సింపుల్ అయినప్పటికీ ఫస్టాఫ్ ని ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు మేర్లపాక గాంధీ కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేక పోయాడు . ఫస్టాఫ్ స్థాయిలో సెకండాఫ్ లేకపోవడంతో ప్రేక్షకులు కాస్త అసహనానికి గురయ్యేలా చేసాడు . హిప్ హాప్ తమిళ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది , నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకు హెల్ప్ అయ్యింది . కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం కనుల విందుగా ఉంది .
ఓవరాల్ గా :
నాని పెర్ఫార్మెన్స్ కోసం తప్పకుండా ఓసారి చూడొచ్చు