
టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న మినిమమ్ బడ్జెట్ ఫిల్మ్ ని వైష్ణవ్‌తేజ్‌తో రూపొందిస్తున్నారు. `కొండ పొలం` నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పక్కా ప్లానింగ్‌తో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తోంది. 40 డేస్ లో పూర్తి చేయాలని ప్లాన్ చేసిన ఈ మూవీ దాదాపుగా పూర్తియింది. బ్యాలెన్స్‌గా వున్న షూట్‌ని ఈ వారంలో పూర్తి చేయబోతున్నారు.
పవర్‌స్టార్‌తో క్రిష్ ఓ నిరియాడిక్ మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఏ.ఎం.రత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపేశారు. లాక్‌డౌన్ బిఫోర్ షూటింగ్ మొదలైన ఈ చిత్రానికి సంబంధించిన కీలక ఘట్టాలని షూట్ చేశారు. అయితే మళ్లీ షూటింగ్‌లు ప్రారంభం కావడంతో వన్ `వకీల్‌సాబ్` చిత్రాన్ని పూర్తి చేసేపనిలో పడ్డారు. ఇది పూర్తియిన తరువాత ఆయన క్రిష్ మూవీ కాకుండా మలయాళ హిట్ ఫిల్మ్ `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌లో నటించబోతున్నారు.
ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించి గ్యాప్ లభిస్తే ఆ చిన్న గ్యాప్‌లో క్రిష్ మినీ షెడ్యూల్‌ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ ప్లాన్‌కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. వీఎఫ్ ఎక్స్ వర్క్‌కి సంబంధించిన షాట్స్‌ని పూర్తి చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట. మరి పవన్ ప్లాన్ ఏంటన్నది మాత్రం క్లారిటీ లేదు.