Homeటాప్ స్టోరీస్కౌసల్య కృష్ణమూర్తి రివ్యూ

కౌసల్య కృష్ణమూర్తి రివ్యూ

kousalya krishnamurthy movie review in telugu
kousalya krishnamurthy movie review in telugu

కౌసల్య కృష్ణమూర్తి రివ్యూ 
నటీనటులు : ఐశ్వర్యా రాజేష్ , రాజేంద్ర ప్రసాద్ , శివ కార్తికేయన్
సంగీతం : దిబు నైనన్ థామస్
నిర్మాత : కే ఏ వల్లభ
దర్శకత్వం : భీమనేని శ్రీనివాసరావు 
రేటింగ్ : 3.5/5 
విడుదల తేదీ : 23 ఆగస్టు 2019

తమిళంలో సంచలన విజయం సాధించిన ”కణా ” చిత్రాన్ని తెలుగులో ” కౌసల్య కృష్ణమూర్తి ” గా రీమేక్ చేసారు . ఐశ్వర్యా రాజేష్ , రాజేంద్రప్రసాద్ తదితరులు నటించిన ఈ చిత్రం తమిళంలో మాదిరిగానే తెలుగులో కూడా మెప్పించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

- Advertisement -

కథ :
కృష్ణమూర్తి ( రాజేంద్రప్రసాద్ ) అనే సాధారణ రైతు కి వ్యవసాయం అంటే ఎంత ఇష్టమో అంతకంటే ఎక్కువగా క్రికెట్ అంటే ఇష్టం . క్రికెట్ అంటే ఎంత ఇష్టం అంటే తండ్రి చనిపోయినా క్రికెట్ చూస్తూ ఉన్న వ్యక్తి అలాంటి కృష్ణమూర్తి కూతురు కౌసల్య చిన్నప్పటి నుండి తండ్రి కోరిక నెరవేర్చాలనే సంకల్పంతో ఇండియా తరుపున క్రికెట్ ఆడి గెలిపించాలని అనుకుంటుంది . అయితే ఈ క్రమంలో కౌసల్య ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి ? చివరకు కౌసల్య తండ్రి కోరిక నెరవేర్చిందా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :
ఐశ్వర్యా రాజేష్
రాజేంద్ర ప్రసాద్
సంగీతం

డ్రా బ్యాక్స్ :
ట్విస్ట్ లు లేకపోవడం

నటీనటుల ప్రతిభ :
కౌసల్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్ అభినయం అద్భుతం , ఆల్రెడీ తమిళంలో ఇదే పాత్రని చేసి ఉండటంతో తెలుగులో మరింతగా రాణించింది . సహజంగానే తెలుగమ్మాయి అయిన ఐశ్వర్యా రాజేష్ తమిళంలో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ పొందింది కట్ చేస్తే ఇన్నాళ్లకు తెలుగులో ఓ మంచి చిత్రంతో అంతకుమించిన అభినయంతో పరిచయం కావడం ముదావహం . ఇక ఐశ్వర్యా పాత్ర కొంతమంది అమ్మాయిలకు స్ఫూర్తి నిచ్చే పాత్ర అనే చెప్పాలి . రాజేంద్ర ప్రసాద్ రైతుగా చక్కని నటన ప్రదర్శించాడు . క్రికెట్ ప్రేమికుడిగా , రైతుగా కంటతడి పెట్టించాడు . యాంకర్ ఝాన్సీ తల్లి పాత్రలో రాణించింది . ఇక కీలక పాత్రలో శివ కార్తికేయన్ నటించి మెప్పించాడు .

సాంకేతిక వర్గం :
క్రికెట్ నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి అయితే వాటికీ భిన్నంగా రైతుల సమస్యలను కూడా జోడించి అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకులు భీమనేని శ్రీనివాసరావు . రీమేక్ కింగ్ గా పేరొందిన భీమనేని కౌసల్య కృష్ణమూర్తి ని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా తీర్చి దిద్దాడు . విజువల్స్ బాగా కుదిరాయి , ఇక నేపథ్య సంగీతం అలాగే పాటలు కూడా ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి . నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పేదేముంది అగ్ర నిర్మాత కే ఎస్ రామారావు , వల్లభ అవసరమైన మేరకు ఖర్చు పెట్టి సినిమా బాగా రావడానికి దోహదపడ్డారు .

ఓవరాల్ గా :
స్ఫూర్తి నిచ్చే చిత్రం

Click Here: Kousalya Krishnamurthy Movie Review in English

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All