Homeటాప్ స్టోరీస్`కొత్త కుర్రోడు` ఆడియో విడుద‌ల‌

`కొత్త కుర్రోడు` ఆడియో విడుద‌ల‌

`కొత్త కుర్రోడు` ఆడియో విడుద‌ల‌శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజా నాయుడు.ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌) నిర్మిస్తోన్న చిత్రం `కొత్త కుర్రోడు`. సాయి ఎలేంద‌ర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో జ‌రిగింది. సినిమా ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ల్యాణ్ ఆవిష్క‌రించి చిత్ర యూనిట్‌ను అభినందించారు. రాజ్ కందుకూరి ఆడియో సీడీల‌ను విడుద‌ల చేశారు. తొలి సీడీని రామ స‌త్య‌నారాయ‌ణ అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా…

రాజ్ కందుకూరి మాట్లాడుతూ – “హీరో, హీరోయిన్‌, నిర్మాత స‌హా చాలా మంది కొత్త కుర్రోళ్లు క‌లిసి చేసిన చిత్ర‌మే `కొత్త కుర్రోడు`. టైటిల్ బావుంది. డైరెక్ట‌ర్ రాజా నాయుడుగారు త‌న అమ్మాయి శ్రీ ప్రియ‌ను హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేయ‌డం అభినంద‌నీయం. లో బ‌డ్జెట్‌లో సినిమాను చ‌క్క‌గా తీసిన‌ట్టు క‌న‌ప‌డుతుంది. హీరో శ్రీరామ్‌, హీరోయిన్ శ్రీప్రియ చ‌క్క‌గా న‌టించారు. మంచి కంటెంట్ ఉంటే సినిమాలు స‌క్సెస్ అవుతాయ‌ని చాలా సినిమాలు నిరూపించాయి. ఈ సినిమా కూడా ఆ కోవ‌లో నిల‌బ‌డుతుంద‌ని భావిస్తున్నాను. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్‌“ అన్నారు.

- Advertisement -

రామ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ – “సినిమాకు త‌గ్గ టైటిల్‌. సాంగ్స్ బావున్నాయి. హీరోలో మంచి ఈజ్ క‌న‌ప‌డుతుంది. హీరోయిన్ చ‌క్క‌గా చేసింది. సాయి ఎలేంద‌ర్ సంగీతం బావుంది. త‌ప్ప‌కుండా సినిమా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది“ అన్నారు.

బ‌సిరెడ్డి మాట్లాడుతూ – “పాట‌లు బావున్నాయి. సాయి ఎలేంద‌ర్ సంగీతం ఆక‌ట్టుకుంది. స‌తీశ్ కెమెరా వ‌ర్క్ బావుంది. సినిమా పెద్ద విజ‌యం సాధించి ద‌ర్శ‌కుడు రాజా నాయుడు, హీరో శ్రీరామ్‌, హీరోయిన్ శ్రీప్రియ స‌హా యూనిట్‌కు మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

నిర్మాత ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌) మాట్లాడుతూ – “డైరెక్ట‌ర్ రాజా నాయుడుగారు సినిమాను అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం చ‌క్క‌గా తీశారు. హీరో హీరోయిన్స్ బాగా న‌టించారు. సినిమా బాగా వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయి ఎలేంద‌ర్ మాట్లాడుతూ – “అనూప్‌గారి ద‌గ్గ‌ర కీ బోర్డ్ ప్లేయ‌ర్‌గా ఉన్న నాకు రాజా నాయుడుగారు సంగీతం చేసే అవ‌కాశం ఇచ్చారు. మంచి క‌థ‌కు సంగీతం చేసే స్కోప్ ఎక్కువ‌గా ఉంటుంది. ఆ స్కోప్ ఈ సినిమాకు ఉంది. త‌ప్ప‌కుండా సినిమా మెప్పించేలా ఉంటుంది“ అన్నారు.

ద‌ర్శ‌కుడు రాజా నాయుడు.ఎన్ మాట్లాడుతూ – “ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ స‌హ‌కారం వల్ల‌నే సినిమాను అనుకున్న విధంగా పూర్తి చేయ‌గ‌లిగాను. ఎన్నో అడ్డంకులు వ‌చ్చినా నిర్మాత లక్ష్మ‌ణ్‌గారు మాకు అండ‌గా నిల‌బ‌డి సినిమాను పూర్తి చేయించారు. సినిమాటోగ్రాఫ‌ర్ స‌తీశ్‌గారు చ‌క్క‌టి విజువ‌ల్స్‌తో సినిమాను పిక్చ‌రైజ్ చేశారు. మా అమ్మాయి శ్రీప్రియ‌ను హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేస్తున్నాను. హీరో శ్రీరామ్ చ‌క్క‌గా యాక్ట్ చేశాడు. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నాం“ అన్నారు.

ప‌దిలం క‌ల్యాణ్ బాబు మాట్లాడుతూ – “సినిమాలో విల‌న్‌గా చేశాను. తొలి సినిమా. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే క‌థ‌, క‌థ‌నం. అన్ని ఎలిమెంట్స్‌తో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. రాజా నాయుడుగారు నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు థాంక్స్‌. శ్రీరామ్‌,  శ్రీప్రియ స‌హా అంద‌రికీ మంచి పేరు తెచ్చే చిత్రంగా ఇది నిల‌వాల‌ని కోరుతున్నాను“ అన్నారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ – “మా నాన్న‌గారు థియేట‌ర్ ఆప‌రేట‌ర్‌. ఆయ‌న వ‌ల్ల నాకు కూడా సినిమాలంటే ఆస‌క్తి క‌లిగింది. అదే ఉత్సాహంతో హీరోగా ఎదిగాను. రాజా నాయుడుగారు నాకు హీరోగా అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌న అమ్మాయిని ఈ సినిమాలో హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేయ‌డం గొప్ప విష‌యం. అన్ని ఎమోష‌న్స్ ఉన్న సినిమా ఇది. సాయిఎలేంద‌ర్‌గారు ఎక్స్‌ట్రార్డిన‌రీ మ్యూజిక్ ఇచ్చారు“ అన్నారు.

హీరోయిన్ శ్రీప్రియ మాట్లాడుతూ – “డైరెక్ట‌ర్ మా నాన్న‌గారు అయినా కూడా న‌న్ను ఆడిష‌న్‌లోనే ఎంపిక చేసుకున్నారు. మంచి రోల్ చేశాను. హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేసిన నాన్న‌కు థాంక్స్‌“ అన్నారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఇత‌ర అతిథులు చిత్ర యూనిట్ ను అభినందించారు.
శ్రీరామ్‌, శ్రీప్రియ‌, ప‌దిలం క‌ల్యాణ్ బాబు, జెవి.రావు, యోగి, అంజ‌లి, శ్రావ‌ణి, మాధ‌వీ ల‌త‌, ఆశ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి నిర్వ‌హ‌ణ: అబ్బూరి నాగేంద్ర చౌద‌రి, కెమెరా: స‌తీశ్ ముదిరాజ్‌, ఎడిట‌ర్‌:  రాఘ‌వేంద్ర రెడ్డి, సంగీతం:  సాయి ఎలేంద‌ర్‌, నిర్మాత‌:  ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌), క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  రాజా నాయుడు.ఎన్‌.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All