Homeన్యూస్కొత్తగా మా ప్రయాణం రివ్యూ

కొత్తగా మా ప్రయాణం రివ్యూ

Kothaga Maa Prayanam Reviewకొత్తగా మా ప్రయాణం రివ్యూ :
నటీనటులు : ప్రియాంత్ , యామిని భాస్కర్ , భాను
సంగీతం : కార్తీక్ కుమార్ రొడ్రీగ్
నిర్మాత : నిశ్చయ్ ప్రొడక్షన్స్
దర్శకత్వం : రమణ మొగిలి
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 25 జనవరి 2019

నూతన కథానాయకుడు ప్రియాంత్ హీరోగా యామిని భాస్కర్ హీరోయిన్ గా ఈ వర్షం సాక్షిగా ఫేమ్ రమణ మొగిలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” కొత్తగా మా ప్రయాణం ” . ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించారా ? లేదా చూద్దామా !

- Advertisement -

కథ :

సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన కార్తీక్ ( ప్రియాంత్ ) లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలనే మనస్తత్వం కలిగిన వాడు . నచ్చిన అమ్మాయితో ఎంజాయ్ చేసే కార్తీక్ కీర్తి ( యామిని భాస్కర్ ) ని చూసిన వెంటనే ఇష్టపడతాడు . అయితే పెళ్లి అంటే పెద్దగా నమ్మకం లేని కార్తీక్ కీర్తి తో సహజీవనం చేద్దామని ప్రతిపాదన చేస్తాడు . కీర్తి కి కూడా ప్రేమ పెళ్లి పై పెద్దగా అభిప్రాయం ఉండదు దాంతో సహజీవనం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది . అయితే ఎప్పుడైతే సహజీవనం చేయడం మొదలు పెడతారో ముందు బాగానే ఉంటారు కానీ మెల్లి మెల్లిగా మనస్పర్థలు మొదలై విడిపోతారు . విభేదాలతో దూరమైన కార్తీక్ , కీర్తి మళ్ళీ కలుస్తారా ? ఒక్కటి అవుతారా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

ప్రియాంత్ నటన , డ్యాన్స్
యామిని భాస్కర్ యాక్టింగ్ , గ్లామర్
స్టోరీ లైన్
నేపథ్య సంగీతం

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే

నటీనటుల ప్రతిభ :

ప్రియాంత్ కొత్తవాడు అయినప్పటికీ అద్భుతంగా నటించాడు . ఇక కీలక సన్నివేశాల్లో అయితే ఎంతో అనుభవం ఉన్న నటుడిగా నటించి మెప్పించాడు . అలాగే డ్యాన్స్ లో రాణించాడు , హీరోయిన్ యామిని భాస్కర్ గ్లామర్ తో అలరించింది , అంతేకాదు అంతకుమించిన నటన ని ప్రదర్శించింది . పైగా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది . ….. రొమాంటిక్ సీన్స్ లో ఇద్దరూ రెచ్చిపోయి యువతకు కావలసినంత మసాలా ని అందించారు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

యువతకు అమితంగా నచ్చే సహజీవనం లైన్ ని కథా వస్తువుగా ఎంచుకున్నాడు దర్శకుడు . చాలావరకు యువతని ఆకట్టుకునే అన్ని అంశాలను రాసుకున్నాడు , చిత్రీకరించాడు . అయితే ఇంకాస్త గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే మరింతగా బాగుండేది . నిర్మాణ విలువలు బాగున్నాయి . ప్రియాంత్ తన స్నేహితులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం . నేపథ్య సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . పాటలు బాగున్నాయి , యువతని అలరించేలా ఉన్నాయి . తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కినప్పటికీ విజువల్స్ చాలా బాగున్నాయి . ఇక డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి .

ఓవరాల్ గా :

యువతకు నచ్చే కొత్తగా మా ప్రయాణం .

English Title: Kothaga Maa Prayanam Review

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All