
గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరపైకి రానున్న ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాలని ప్లాన్ చేశాయి. అయితే ఈ మూవీ ఆగిపోయిందని, ఆ ప్లేస్‌లో మరొకరితో ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని చేయబోతున్నారంటూ వార్తలు వినిపించాయి.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇదొక పెద్ద జోక్ అని అని సితార ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఇటీవల సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న వార్తే నిజమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ 30వ త్రివిక్రమ్‌తో కాదని, కొరటాల శివతో అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఈ రోజు వచ్చే అవకాశం వున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్‌తో `ఆచార్య` మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పూర్తయిన తరువాత అంటే జూన్‌లో ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని కొరటాల ప్రారంభిస్తారట. ఈ చిత్రానికి నిర్మాతలు ఎవరు? అన్నది త్వరలోనే వెల్లండించనున్నట్టు తెలిసింది. `జనతా గ్యారేజ్` చేసిన విషయం తెలిసిందే. ఈ సారి అంతకు మించిన కథ, కథనాలతో తదుపరి సినిమా వుంటుందని తెలుస్తోంది. మోస్ట్‌లీ మైత్రీ మూవీమేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించే అవకాశం వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం `ఆర్ ఆర్ ఆర్`లో నటిస్తున్న విషయం తెలిసిందే.