
అగ్ర దర్శకుడు కొరటాల శివ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. అయితే సోషల్ మీడియా నుండి తాను దూరమవుతున్నట్లు కొరటాల శివ తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో ఒక పోస్ట్ ను పెట్టాడు. “ట్విట్టర్ లో నాకు చాలా మంచి అనుబంధముంది. చాలా మంచి మెమోరీస్ ఉన్నాయి. కానీ ఇక మూవ్ ఆన్ అవ్వాల్సిన సమయం వచ్చింది” అని పోస్ట్ పెట్టాడు.
అంతే కాకుండా, “మీడియా మారుతుంది కానీ మన బాండ్ మాత్రం మారదు” అని తెలిపాడు కొరటాల శివ. సోషల్ మీడియాలో లేకపోయినా కానీ రెగ్యులర్ మీడియా ద్వారా టచ్ లో ఉంటానని తెలిపాడు కొరటాల శివ. అయితే ఈ అగ్ర దర్శకుడు మీడియా వదిలేయడానికి మాత్రం కారణం తెలపలేదు.
ఇక కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోన్న విషయం తెల్సిందే. మరో 30 శాతం షూటింగ్ ను ఈ చిత్రం పూర్తి చేయాల్సి ఉంది. దీని తర్వాత ఎన్టీఆర్ తో కొరటాల శివ పనిచేయనున్నాడు.
— koratala siva (@sivakoratala) June 25, 2021