
మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న కొరటాల శివ ఆ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే తారక్ సినిమా తర్వాత కొరటాల శివ నందమూరి నట సింహం బాలయ్య బాబుతో సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్. బాలకృష్ణ అఖండ తర్వాత రీసెంట్ గా గోపీచంద్ మలినేని సినిమా షురూ చేశారు.
ఈ సినిమా తర్వాత కొరటాల శివ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తుంది. సామాజిక అంశాలను కథగా ఎంచుకుని వాటికి స్టార్ హీరో తాలూఖా కమర్షియాలిటీ యాడ్ చేసి వరుస హిట్లు కొడుతున్నాడు కొరటాల శివ. ఆచార్య కూడా ఇదే తరాహ్లో ఉండబోతుందని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ఫిబ్రవర్ 4న రిలీజ్ ఫిక్స్ చేశారు.
నందమూరి బాలకృష్ణతో కొరటాల శివ సినిమా అనగానే నందమూరి ఫ్యాన్స్ లో ఎక్సయిటింగ్ మొదలైంది. బాలయ్య లాంటి మాస్ హీరోతో కొరటాల శివ లాంటి కంటెంట్ ఉన్న డైరక్టర్ సినిమా చేస్తే ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పుకుంటున్నారు. తప్పకుండా వీరి కాంబో సినిమా సెన్సేషనల్ అవుతుందని చెప్పొచ్చు.