
మిర్చి మూవీ తో డైరెక్టర్ గా మారిన కొరటాల శివ..ఆ తర్వాత శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అను నేను వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం ఆచార్య తో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చిరంజీవి , రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక మొదటి నుండి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చేసే శివ..పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఆచార్య చిత్ర ప్రమోషన్ లలో పవన్ తో సినిమా ఫై శివ స్పందించారు.
పవన్ కళ్యాణ్ కోసం కూడా మంచి సినిమా చేయాలని అనుకున్నాడట. దర్శకుడు కాక ముందుకే శ్రీమంతుడు తరహాలో పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి పాయింట్ కూడా అనుకున్నట్లు చెప్పాడు. సమయం కుదిరితే మాత్రం తప్పకుండా ఆయనతో సినిమా చేస్తానని కూడా కొరటాల శివ తెలియజేశాడు. శివ క్లారిటీ తో త్వరగా సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.