
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ తర్వాత శివ..ఎన్టీఆర్ 30 వ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. ఇక ఈ మూవీ తర్వాత కొరటాల అగ్ర హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు.
కొరటాల శివ ఎన్టీఆర్ తర్వాత మహేష్‌తో సినిమా చేయనున్నట్లు తెలిపాడు. గతంలో వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దాంతో మహేష్‌తో హ్యట్రిక్ సినిమాను చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో పాటుగా చరణ్, అల్లుఅర్జున్‌లతో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఈ ఇద్దరి డేట్స్‌ను బట్టి ఒక ప్రాజెక్ట్‌ను ముందు స్టార్ట్ చేస్తా అని తెలిపాడు. అంతేకాకుండా ఇప్పుడు వీటి గురించి మాట్లాడటం కరెక్టు కాదు అంటూ తెలిపాడు.