
తెలుగు సినిమాలో 16 సంవత్సరాల క్రితం జరిగిన ముచ్చట ఇది.. అప్పటి కర్నూల్ కొండారెడ్డి బృడ్జు లొకేషన్ యే మళ్ళి తిరిగి వచ్చింది. ఈసారి కూడా గుర్తుండిపోయే చరిత్ర సృష్టిస్తుంది అంటున్నారు దర్శకులు “అనిల్ రావిపూడి” గారు. మన ప్రిన్స్ “మహేష్ బాబు” గారితో చేస్తున్న “సరిలేరు నీకెవ్వరు” సినిమాలో జరిగిన ఒక సంఘటనని గుర్తు చేసుకున్నారు.. అదేంటో చూద్దామా?
16 సంవత్సరాల క్రితం “ఒక్కడు” సినిమా వచ్చింది, మహేష్ బాబు, గుణశేఖర్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమాలో “కర్నూల్ కొండారెడ్డి బృడ్జు” సీన్ గుర్తుంది కదా? అదేనండి ప్రకాష్ రాజ్ ని గుద్దితే ట్రాన్స్ ఫారం కి తగిలి నిప్పులు గక్కే సీన్ లో మహేష్ బాబు వెనకాల ఉన్న లొకేషన్ యే మనం మాట్లాడుకుంటున్న లొకేషన్!
మహేష్ బాబు సినిమాల విషయంలో ఉండే సెంటిమెంట్ ని దర్శకులు ఎవరైతే ఉన్నారో మహేష్ బాబు ని, మహేష్ బాబు సినిమాలలోని కొన్నింటిని గుర్తుపెట్టుకొని సన్నివేశానుసారం, కథకి అనుగుణంగా వాడుకుంటారు. అలా సెంటిమెంట్ ని ఫాలో అవుతూ చేసిన సినిమాలని జనాలు బాగా ఆదరించారు. ఇప్పుడు ఒక్కడు లోని “కర్నూల్ కొండారెడ్డి బృడ్జు” మళ్ళీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో కనిపిస్తుంది.. కథానుసారం, సన్నివేశానికి తగ్గట్టుగా ఉంటుంది అని, ఆ సీన్ లో మళ్ళీ మనం ఒక్కడులాంటి పవర్ కనపడుతుంది, ఈ సారి మళ్ళీ చరిత్ర తిరగరాస్తుంది అని ట్వీట్ చేశారు అనిల్ రావిపూడి గారు.
ఇక ఆవిధంగా పోస్ట్ లో మహేష్ బాబు బృడ్జు ముందు నిలబడిఉన్న ఫోటో ఒకటి షేర్ చేసి మహేష్ అభిమానులకి తీపి కబురు అందించారు. మరి ఒక్కడు లాగానే, సరిలేరు నీకెవ్వరు సీన్ కూడా పవర్ఫుల్ గా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు మహేష్ అభిమానులు.