Homeటాప్ స్టోరీస్కేసీఆర్ ది తుగ్లక్ పాలన : కొండా సురేఖ

కేసీఆర్ ది తుగ్లక్ పాలన : కొండా సురేఖ

Konda surekha couple fires on kcrకేసీఆర్ ది తుగ్లక్ పాలన అంటూ నిప్పులు చెరిగింది మాజీ మంత్రి కొండా సురేఖ . తెలంగాణ రాష్ట్ర సమితి తరపున వరంగల్ ఈస్ట్ ఎం ఎల్ ఏ గా ప్రాతినిధ్యం వహించిన కొండా సురేఖకు ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో చోటు లభించలేదు దాంతో బిసి మహిళనైనా నాకు టికెట్ ఇవ్వకుండా ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసారని ….. అసలు ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా టికెట్ ఇవ్వకుండా మహిళలను అవమానించారని , ఒక్కసారి కూడా సచివాలయం కు వెళ్లకుండా తుగ్లక్ పాలన చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేసింది కొండా సురేఖ .

105 మందితో తొలిజాబితా ప్రకటించారు , వాళ్ళకంటే నేనేట్లా తక్కువ ! నాకు టికెట్ కేటాయించకపోయినా , మమ్మల్ని పిలిచి మాట్లాడతారేమో అని ఎదురు చూసాం ……. లేఖ రాసినప్పటికీ స్పందన లేకుండాపోయింది . కేటిఆర్ మీద ప్రేమ ఉంటే ఎనిమిదో వింత ని సృష్టించి బహుమతిగా ఇవ్వండి అంతేకాని తెలంగాణ మీ అయ్యజాగీరు కాదు . మేము హరీష్ రావు వర్గం , ఇంకా హరీష్ వెంట చాలామంది నాయకులున్నారని మరో వివాదాన్ని రేపింది కొండా సురేఖ . తెలంగాణ మంత్రివర్గంలో ఉన్నవాళ్లు ఎవరు ? మిమ్మల్ని తిట్టినవాళ్ళే కదా ! తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు స్మృతివనం లేదు కానీ ఆంధ్రోడు అయిన హరికృష్ణ కు స్మ్రుతి వనం కు స్థలం ఇస్తారా ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది కొండా సురేఖ . ఇక కొండా మురళి కూడా కేసీఆర్ , కేటీఆర్ లపై నిప్పులు చెరిగాడు . వరంగల్ జిల్లా లో అత్యధిక స్థానాల్లో కొండా దంపతుల ప్రభావం ఉంది దాంతో కొండా సురేఖ వల్ల టిఆర్ఎస్ పార్టీ కొన్ని స్థానాలను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది .

- Advertisement -

English Title: Konda surekha couple fires on kcr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All