
ఆర్ఆర్ఆర్ నుండి మరో ఫుల్ వీడియో సాంగ్ ఈరోజు సాయంత్రం రాబోతుంది. రీసెంట్ గా నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్ ను విడుదల చేసిన మేకర్స్…ఈరోజు సాయంత్రం 4 గంటలకు కొమ్మ ఉయ్యాలా సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. ఎమ్ఎమ్ కీరవాణి స్వర పరిచిన బాణీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విడుదలకు ముందే ఈ పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సాధించాయి. అయితే థియేటర్లకు వెళ్ళిన ప్రేక్షకులు మాత్రం సర్ ప్రైజ్‌గా వచ్చిన ‘కొమ్మ ఉయ్యాల’ పాటకు ఫిదా అయ్యారు.
సినిమా విడుదల తర్వాత ఎక్కువగా ప్రేక్షకులు ఈ పాట గురించే మాట్లాడుకున్నారు. సినిమా ప్రారంభంలో మల్లీ హమ్ చేసిన ఈ పాటను చిన్నారి ప్రకృతి రెడ్డి ఆలపించింది. ఈమె గొంతుకు ప్రేక్షకులు మంత్ర ముగ్థులయ్యారు. అప్పటినుంచి ఈ పాటను విడుదల చేయమని నెటీజన్లు మేకర్స్ కొరుతూనే ఉన్నారు. అయితే తాజాగా ఈ పాట వీడియో సాంగ్‌ను శనివారం సాయంత్రం 4గంటలకు విడుదల కానున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ కొమురం భీం గెటప్‌లో భుజాలపై మల్లీని ఎత్తుకొని పయనమవతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 25న విడుదలై భారీ కలెక్షన్లను రాబడుతుంది. నైజాంలో 100కోట్ల మార్కును టచ్ చేసిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. రీసెంట్‌గానే ఈ చిత్రం 1000కోట్ల మార్కును కూడా టచ్ చేసి హైయెస్ట్ గ్రాసర్ ఫిలింస్‌లో టాప్-3లో ఆర్ఆర్ఆర్ చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఇంకా థియేటర్స్ లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.