
తమిళ నాట నీట్ చిచ్చు ముదురుతోంది. చిన్న చిన్నగా మతం రంగు పులుముకుంటోంది. నీట్ పరీక్షల్ని రద్దు చేయాలని, ప్రస్తుత పరీస్థితుల్లో నిర్వహించడం భావ్యం కాదని సామాజిక వేత్తలు, విద్యార్థులు, సినీ స్టార్స్ కేంద్రానికి విన్న వించారు. అయినా ఎవరి మాట లెక్కచేయని కేంద్రం నీట్ పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపింది. న్యాయస్థానాలు కూడా నీట్‌కే జైకొట్టాయి. దీంతో చెన్నైకి చెందిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
దీంతో ఆగ్రహించిన హీరో సూర్య నీట్ పరీక్షల నిర్వహణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం మొదలైంది. సూర్య వ్యాఖ్యలు న్యాయ వ్యవస్తని కించపరిచేవిగా వున్నాయని ఓ న్యాయ వాది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ చెన్నై హైకోర్టులో పిటీషన్ వేశారు. అయితే ఈ కేసుని విచారించిన ధర్మాసనం సూర్య తప్పు చేశారని అయితే ఈ సందర్భంగా ఆయనని క్షమిస్తున్నామని వెల్లడించి కేసు కొట్టేసింది. దీంతో అంతా వివాదం ముగిసిందని భావించారు. కానీ ఇది మతం రంగు పులుముకోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఓ మతానికి చెందిన వాలటీర్లు 75 మంది సమూహంగా ఏర్పడి హీరో సూర్య చిత్ర పటాన్ని చెప్పులతో కొట్టి పైశాచిక ఆనందాన్ని పొందడం చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న కోయంబత్తూర్ పోలీసులు స్పందించి వారిని అదుపు చేయడంతో పెద్ద వివాదం సద్దు మనిగింది. ఎవరెన్ని రకాలుగా సూర్యని విమర్శించినా కోలీవుడ్ మాత్రం వి స్టాండ్ విత్ సూర్య అనే నినాదంతో ఒక్కటిగా నిలిచింది.