Homeటాప్ స్టోరీస్ఫిల్మ్ ఫేర్ ని బాయ్ కాట్ చేసిన తమిళ చిత్ర పరిశ్రమ

ఫిల్మ్ ఫేర్ ని బాయ్ కాట్ చేసిన తమిళ చిత్ర పరిశ్రమ

kollywood boycotts filmfare awardsహైదరాబాద్ లో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకని తమిళ చిత్ర పరిశ్రమ బాయ్ కాట్ చేసింది . పెద్ద ఎత్తున అవార్డుల వేడుకలు నిర్వహిస్తూ నిర్వాహక సంస్థ లు బాగా సొమ్ము చేసుకుంటున్నాయి అయితే నటీనటులకు మాత్రం ఏమాత్రం లాభం చేకూరడం లేదు అంతేకాదు సినిమా రంగ సంస్థలకు విరాళాలు కూడా అందడం లేదు దాంతో ఇకపై అటువంటి సంస్థలకు సహకరించకూడదు అంటూ దక్షిణ భారత నడిగర్ సంఘం తీర్మానించింది .

అవార్డుల వేడుకలో హీరోలు , హీరోయిన్ లు రకరకాల పెర్ఫార్మెన్స్ ఇస్తారు అలాగే కమెడియన్ లు నవ్వులు పూయిస్తారు కానీ ఇంత చేసినప్పటికీ నిర్వాహకులకు పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నప్పటికీ నటీనటులకు ప్రయోజనం చేకూరడం లేదు కాబట్టి ఇకపై నటీనటులకు డబ్బులు ఇచ్చేవాళ్ల కు మాత్రమే సహకరించాలని , ఒకవేళ వ్యక్తిగతంతా ఇవ్వలేక పొతే నటీనటుల సంఘం కు లేదా నడిగర్ సంఘం కు విరాళం ఇవ్వాలని అలా ఇచ్చినట్లయితేనే మా సహకారం ఉంటుందని అంటున్నాడు హీరో విశాల్ . ఇటీవలే ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక హైదరాబాద్ లో జరుగగా ఆ వేడుకకు తమిళ సినిమా రంగం వాళ్ళు పెద్దగా హాజరుకాలేదు . ఇకపై ఎవ్వరు కూడా హాజరు కాకుండా చూస్తానని అంటున్నాడు విశాల్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All