
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గని మూవీ ఏప్రిల్ 08 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్లో భాగంగా ఈరోజు గురువారం కొడితే అంటూ సాగే ఐటెం సాంగ్ ఫుల్ వీడియో ను విడుదల చేసారు. ఈ సాంగ్ లో తమన్నా అదిరిపోయే గ్లామర్ తో చిందులేసి అదరగొట్టింది.
గద్దల కొండ గణేష్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న వరుణ్ తేజ్ ఈ మూవీ లో బాక్సర్ గా కనిపించబోతున్నాడు. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తుండగా.. ఈ మూవీ లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, సాయి మంజ్రేకర్ వంటి నటినటులు కీలక పాత్రల్లో నటించారు. రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మించారు.
- Advertisement -

- Advertisement -