Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ కు కొడాలి నాని సూచన..

పవన్ కళ్యాణ్ కు కొడాలి నాని సూచన..

Kodali Nani Sensational Comments on Bheemla Nayak Movie
Kodali Nani Sensational Comments on Bheemla Nayak Movie

పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రానికి రాజకీయ రంగు అంటుకుంది. సినిమా రిలీజ్ రోజు ఏపీ సర్కార్ అదనపు షోస్, బెనిఫిట్ షోస్ అనుమతులు ఇవ్వకపోవడం, ధరలు పెంచుకునే అవకాశం ఇవ్వకపోగా..టికెట్స్ విషయంలోనూ పలు ఇబ్బందులకు గురి చేయడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలు రాజకీయ పార్టీ లు సైతం భీమ్లా నాయక్ కు అన్యాయం జరిగిందని , కావాలనే జగన్ సర్కార్ పవన్ కళ్యాణ్ సినిమాలపై కక్ష్య సాధింపు చర్య చేస్తుందని పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం తో రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది.

ఈ క్రమంలో వైసీపీ మంత్రి కొడాలి నాని సినిమా టికెట్ల వ్యవహారంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై నాని ఘాటుగా స్పందించారు. భీమ్లా నాయక్ సినిమా కు రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి షరతులు పెట్టలేదని.. టికెట్ల రేట్లపై కమిటీ సూచనలు చేసిందని.. కానీ పెంచే లోపు అవాంతరాలు వచ్చాయని నాని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ దగ్గర చిరంజీవి విన్నపంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నాని స్పందించారు. పవన్ కల్యాణ్ మాటలు సరికాదంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన పవన్‌కు సూచించారు. సినిమాలను.. రాజకీయాలకు ముడిపెట్టొద్దని , టీడీపీ, జనసేన నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని పేర్కొన్నారు. చిరంజీవిని జగన్ ఎంతో గౌరవిస్తారని.. దానిని తప్పుబట్టడం సరికాదన్నారు. పిల్లల్లో పిల్లవాడిలా.. పెద్దల్లో పెద్దవాడిగా చిరంజీవి ఉంటారని.. ఆయన్ను చిల్లర రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. చంద్రబాబు కోసం సొంత తమ్ముడే.. అన్నను అవమానిస్తారా..? అంటూ ప్రశ్నించారు. పవన్, ఆయన కుటుంబం ఉన్నత స్థానంలో ఉందంటే చిరంజీవి కారణం కాదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఉచ్చులో పడొద్దని పవన్‌కు సూచించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All