Homeటాప్ స్టోరీస్సంపూ చింపేసాడు

సంపూ చింపేసాడు

kobbari matta Movie talk
kobbari matta Movie talk

సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం కొబ్బరిమట్ట ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే . హృదయ కాలేయం చిత్రం తర్వాత తిరిగి అదే కాంబినేషన్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఆ అంచనాలకు తగ్గట్లుగా టికెట్లు కూడా బుక్ ఐయ్యాయి . ఇక సినిమాలో సంపూ డైలాగ్స్ చెబుతుంటే ఈలలే ఈలలు థియేటర్ లో .

హృదయ కాలేయం లో సంపూ యాక్టింగ్ చాలా చోట్ల తేలిపోయింది కానీ కొబ్బరిమట్ట చిత్రంలో మాత్రం చాలా ఇంప్రూవ్ అయ్యాడు . ఇక సంపూ డైలాగ్స్ డైనమైట్ లా పేలాయి . దాంతో కొబ్బరిమట్ట చిత్ర బృందం హిట్ కొట్టినట్లే అని సంతోషపడుతున్నారు . అయితే అక్కడక్కడా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ స్పూఫ్ కామెడీ కోరుకునే వాళ్లకు బెస్ట్ చాయిస్ గా నిలిచింది కొబ్బరిమట్ట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All