
మహేష్ – రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా అన్న వార్త నిజంగా మహేష్ ఫ్యాన్స్‌కి ఓ పండగలా మారింది. ఎన్ని సినిమాలు చేసినా రాజమౌళితో మహేష్ చేయబోయే సినిమాపైనే అందరు ప్రత్యేక దృష్టిని సారించారు. వీరి కలయికలో సినిమా ఇంతకీ ఎలా వుండబోతోంది? .. తన సినిమాల్లో హీరోని ఫెరోషియస్‌గా చూపించే రాజమౌళి స్టార్ హీరో మహేష్‌ని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు? అనే చర్చ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
ఈ చిత్రాన్ని ప్రముఖ దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్ . నారాయణ నిర్మించబోతున్నారు. కొన్నేళ్ల క్రితమే ఈ మూవీ కోసం నిర్మాత కె.ఎల్. నారాయణ అడ్వాన్స్ ఇచ్చి రాజమౌళిని రిజర్వ్ చేసుకున్నారట. ఈ రోజు బుధవారం నిర్మాత పుట్టిన రోజు. ఈ సందర్భంగా రాజమౌళి – మహేష్ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం రాజమౌళి ఈ డెకేడ్‌కి అత్యంత క్రేజీ మల్టీస్టారర్‌గా నిలిచిపోయే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` చిత్రీకరణ చివరి దశలో వుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ని పునః ప్రారంభించబోతున్నారు. ఈ మూవీ పూర్తయిన తరువాతే మహేష్ మూవీని రాజమౌళి పట్టాలెక్కిస్తారని, దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్నిత్వరలో వివరాల్ని వెల్లడిస్తామని పేర్కోన్నారు.