Homeటాప్ స్టోరీస్'మేమ్ ఫేమస్' నటుడిగా నాకు మంచి గుర్తింపును ఇచ్చింది -కిరణ్ మచ్చ

‘మేమ్ ఫేమస్’ నటుడిగా నాకు మంచి గుర్తింపును ఇచ్చింది -కిరణ్ మచ్చ

Kiran Macha of 'Mem Famous' Fame Busy With A Series Of Projects
Kiran Macha of ‘Mem Famous’ Fame Busy With A Series Of Projects

యూట్యూబ్ ఛానెల్స్, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా సోషల్ మీడియాలో టాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వస్తున్నారు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన కిరణ్ మచ్చ ఈ మధ్యనే మేం ఫేమస్ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో అల్లరి చిల్లరగా తిరిగే ముగ్గురు కుర్ర కారుకి అండగా నిలుస్తూ మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు అని వారికి వెన్నుతట్టే ఆ ఊరి సర్పంచ్ వేణు జింక అనే పాత్రలో నటించి అందరిని మెప్పించాడు. ఊరంతా ఆ కుర్రాళ్ళకి యాంటీ అయినా సరే వేణు మాత్రం వారి వెంట నిలబడి వారికి అండగా నిలబడటం ఆసక్తికరంగా ఉంటుంది.

అలా సర్పంచ్ పాత్రలో కిరణ్ మచ్చ అద్భుతంగా నటించి అందరి దృష్టిలో పడ్డాడు. ఇప్పుడు ఆయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అథర్వ, శ్రీరంగనీతులు, ఇంకా టైటిల్స్ ఖరారు కానీ మూడు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకప్పుడు యూట్యూబర్‌గా ఫేమస్ అయిన కిరణ్‌ మచ్చ.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌ మీద వరుస ఆఫర్లు సంపాదించుకుంటున్నాడు. మున్ముందు కిరణ్‌ మచ్చ పేరు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించేలా ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All