Homeటాప్ స్టోరీస్కిల్లర్ రివ్యూ

కిల్లర్ రివ్యూ

killer review
killer review

కిల్లర్ రివ్యూ
నటీనటులు : విజయ్ ఆంటోనీ , అర్జున్
సంగీతం : సైమన్ కే కింగ్
నిర్మాతలు : నరేష్ కుమార్ – శ్రీధర్
దర్శకత్వం : ఆండ్రు లూయిస్
రేటింగ్ : 3/5
రిలీజ్ డేట్ : 7 జూన్ 2019

గతకొంత విజయ్ ఆంటోనీ నటించిన చిత్రాలేవీ సక్సెస్ కావడం లేదు దాంతో ఈ హీరో మార్కెట్ పడిపోయింది . అంచనాలు కూడా లేకుండాపోయాయి . ఈరోజు విడుదలైన కిల్లర్ ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? చూద్దామా !

- Advertisement -

కథ :

మినిష్టర్ తమ్ముడు హత్య కేసు ని పరిశోధిస్తున్న కార్తికేయ ( అర్జున్ ) కు ధరణి ( ఆషిమా నర్వాల్ ) పై అనుమానం కలుగుతుంది .హత్య కేసులో ధరణి పై అనుమానం నిజమని భావించి ఆమెని అరెస్ట్ చేసే క్రమంలో ప్రభాకర్ ( విజయ్ ఆంటోనీ ) అనే వ్యక్తి వచ్చి ఆ హత్య చేసింది నేనే అంటూ పోలీసులకు లొంగిపోతాడు . ఎసిపి గా పనిచేసి జాబ్ మానేసిన ప్రభాకర్ కు ధరణి కి సంబంధం ఏంటి ? అందుకు హత్య కేసులో లొంగిపోయాడు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

విజయ్ ఆంటోనీ
అర్జున్
స్క్రీన్ ప్లే
ట్విస్ట్ లు

డ్రా బ్యాక్స్ :

ఎంటర్ టైన్ మెంట్

నటీనటుల ప్రతిభ :

పోలీస్ ఆఫీసర్ పాత్రలో సీనియర్ హీరో అర్జున్ అద్భుతంగా తన పాత్రని పోషించాడు . ఇక విజయ్ ఆంటోనీ మొదటిసారిగా రకరకాల హావభావాలున్న పాత్రని పోషించి మెప్పించాడు . విజయ్ ఆంటోనీ పై ఒక విమర్శ ఉండేది , ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలకవు అని కానీ ఈ సినిమాలో ఆ లోటు పూడ్చాడు . ఆషిమా నర్వాల్ గ్లామర్ తో అలరించింది అలాగే నటనతో కూడా మెప్పించింది . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధిమేరకు బాగానే నటించారు .

సాంకేతిక వర్గం :

ఆండ్రు లూయిస్ క్రైమ్ థ్రిల్లర్ గా బాగానే రాసుకున్నాడు . ట్విస్ట్ లతో అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ లు బాగా రాసుకున్నాడు . అయితే అక్కడక్కడా కాస్త ఫ్లో దెబ్బతింది . నిర్మాణ విలువలు బాగున్నాయి . మాక్స్ అందించిన ఛాయాగ్రహణం ఈ చిత్రానికి హైలెట్ అనే చెప్పాలి . సంగీతం కూడా అలరించేలా ఉంది .

ఓవరాల్ గా :

క్రైం థ్రిల్లర్ కోరుకునే వాళ్లకు మంచి ఛాయిస్ కిల్లర్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All