Homeటాప్ స్టోరీస్బూర్జ్ ఖ‌లీఫాపై సుదీప్ కొత్త రికార్డ్‌!

బూర్జ్ ఖ‌లీఫాపై సుదీప్ కొత్త రికార్డ్‌!

Kicha sudeep vikrant rona title logo unveiled on burj khalifa
Kicha sudeep vikrant rona title logo unveiled on burj khalifa

తెలుగులో ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కించిన విజువ‌ల్ వండ‌ర్ `ఈగ‌` చిత్రంతో క‌న్న‌డ హీరో కిచ్చా సుదీప్ మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. `బాహుబ‌లి`లోనూ చిన్న పాత్ర‌లో మెరిసిన సుదీప్ తెలుగులో మ‌రింత పాపులారిటీని ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `విక్రాంత్ రానా`. అనూప్ బండారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ తో పాటు స్నేక్ పీక్ వీడియోని ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన బూర్జ్‌ఖ‌లీఫాపై ఆవిష్క‌రించారు. 2000 ఫీట్ల పొడ‌వుతో సుదీప్ `విక్రాంత్ రానా` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు. బూర్జ్ ఖ‌లీఫా పొడ‌వుని ఆవిష్కరించిన ఈ పొస్ట‌ర్ రికార్డుని సృష్టించింది. ఇలా మొట్ట‌మొద‌టి సారి త‌న సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసిన హీరోగా సుదీప్ స‌రికొత్త రికార్డుని సాధించారు.

- Advertisement -

సుదీప్ ఈ ఏడాదితో న‌టుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఈ సంద‌ర్భంగా `విక్రాంత్ రానా` మేక‌ర్స్ ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో పాటు 180 సెకండ్ల నిడివిగ‌ల స్నేక్ పీక్‌ని రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా హీరో కిచ్చా సుదీప్ ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. బూర్జ్ ఖ‌లీఫా వారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. సోమ‌వారం హెచ్‌డీ క్వాలిటీతో స్నేక్‌పీక్‌ని ప్ర‌ద‌ర్శిస్తామ‌ని పేర్కొన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All