
కియారా అద్వానీ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. సంప్రదాయమైన దుస్తులు ధరించిన , ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్న సరే ఆ అందమే అందం అన్నట్లు ఉంటుంది. అలాంటిది తాజాగా సాదా సీదా సమ్మర్ లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచింది. అసలు ఈమె కియారా అంటే కూడా ఎవ్వరు నమ్మరు. ఆలా ఉంది ఈమె. తాజాగా ఈమె స్వర్ణ దేవాలయాన్ని సందర్శించింది. అక్కడికి సాధారణ కుర్తా సూట్ లో వెళ్ళింది.
ఊదా- గులాబీ- ఆకుపచ్చ రంగులలో అందంగా రంగురంగుల పూల ప్రింట్ లను కుర్తా కలిగి ఉంది. ఇలా ఈమెను చూసి ఎవరు కూడా గుర్తుపట్టలేదు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ పిక్స్ చక్కర్లు కొడుతున్నప్పటికీ కియారా అంటే ఎవరు కూడా నమ్మలేకపొతున్నారు. ఇక తెలుగు లో ఈమె రాంచరణ్ సరసన నటిస్తుంది. శంకర్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ గా దీనిని దిల్ రాజు నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ , అంజలి పలు కీలక పాత్రల్లో నటిస్తుండగా ..థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.