Homeటాప్ స్టోరీస్ప్రభాస్ కోసం ఐటెం గర్ల్ గా మారుతున్న కియారా

ప్రభాస్ కోసం ఐటెం గర్ల్ గా మారుతున్న కియారా

Kiara Advani
Kiara Advani

హీరోయిన్ కియారా అద్వానీ ప్రభాస్ కోసం ఐటెం గర్ల్ గా మారుతోందని తెలుస్తోంది . భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన భామ కియారా అద్వానీ . అయితే ఈ భామ తాజాగా ప్రభాస్ చిత్రం సాహో లో ఐటెం గర్ల్ గా మారనున్నట్లు తెలుస్తోంది . అత్యంత భారీ బడ్జెట్ తో సాహో రూపొందుతున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో ఐటెం సాంగ్ కోసం కియారా ని సంప్రదించినట్లు తెలుస్తోంది .

సాహో లో బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది . కాగా ఓ ఐటెం సాంగ్ కూడా చేసే ఆలోచన చేస్తున్నారు . ఈ ఐటెం సాంగ్ కోసం ఇంతకుముందు ఆర్ ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ పేరు వినిపించింది . అయితే దాన్ని ఖండించింది పాయల్ దాంతో ఇప్పుడు కియారా అద్వానీ పేరు వినిపిస్తోంది మరి . ఇక సాహో ఆగస్టు 15 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All